నేను జన సమూహాల గాయాన్ని
గాయాల సమూహాన్ని
తరతరాలుగా స్వతంత్రదేశంలో అస్వతంత్రుణ్ణి
అవమానాలకూ, అత్యాచారాలకూ
మానభంగాలకూ, చిత్రహింసలకు గురై
పిడికెడు ఆత్మగౌరవం కోసం తలెత్తినవాణ్ణి
ధనమదాంధ కులోన్మత్తుల రాజ్యంలో
బతకడమే ఒక నిరసనగా బతుకుతున్నవాణ్ణి
బతికేందుకు పదేపదే చస్తున్నవాణ్ణి
నన్ను బాధితుడని పిలువకండి
నేను అమరుణ్ణి, నేను అమరుణ్ణి, నేను అమరుణ్ణి !