"కూర్చున్న వాడిని కూర్చున్నట్లే వుంటాను దేహం రంగువెలుస్తూ వుంటుంది,
చుట్టూ పరకాయించి చూస్తాను కొండలూ మట్టి నీళ్ళూ సమస్తమూ రంగుతగ్గుతూ వుంటాయి,
నా లోలోపల కురుస్తున్న దిగులువర్షాన్ని చేతులు చాచి తాకుతుంటాను"
మాధవ్ 2009లో రాసిన ఇరవైఏడు పంక్తుల ఈ పద్యం చదివిన తరువాత నేను భారంగా, దిగులుగా, సాలోచనగా, మౌనంగా ఉండిపోయాను. మైనస్ అయిదు డిగ్రీల సెల్సియస్ చలిలో నాచుట్టూ యెవరో వందడిగ్రీల మంటని రాజేసి, నన్ను మరిగించి, కరిగించి వేస్తున్నట్ట, అయినా వేదనలో కేక వేయడానికి కూడా నా నోరు పెగలనట్టు...! నిజమే; వెండీముల్ ఫోర్డ్ అన్నట్లు అత్యుత్తమమైన, సాంద్రమైన కవిత్వం చదివిన తరువాత మనం వెంటనే మాట్లాడలేము. కాసేపు మౌనంగా వుండిపోతాను. అది ఉన్నతదశకి చేరిన కవిత్వానికి ఒక గీటురాయి.
- దేవిప్రియ
"కూర్చున్న వాడిని కూర్చున్నట్లే వుంటాను దేహం రంగువెలుస్తూ వుంటుంది, చుట్టూ పరకాయించి చూస్తాను కొండలూ మట్టి నీళ్ళూ సమస్తమూ రంగుతగ్గుతూ వుంటాయి, నా లోలోపల కురుస్తున్న దిగులువర్షాన్ని చేతులు చాచి తాకుతుంటాను" మాధవ్ 2009లో రాసిన ఇరవైఏడు పంక్తుల ఈ పద్యం చదివిన తరువాత నేను భారంగా, దిగులుగా, సాలోచనగా, మౌనంగా ఉండిపోయాను. మైనస్ అయిదు డిగ్రీల సెల్సియస్ చలిలో నాచుట్టూ యెవరో వందడిగ్రీల మంటని రాజేసి, నన్ను మరిగించి, కరిగించి వేస్తున్నట్ట, అయినా వేదనలో కేక వేయడానికి కూడా నా నోరు పెగలనట్టు...! నిజమే; వెండీముల్ ఫోర్డ్ అన్నట్లు అత్యుత్తమమైన, సాంద్రమైన కవిత్వం చదివిన తరువాత మనం వెంటనే మాట్లాడలేము. కాసేపు మౌనంగా వుండిపోతాను. అది ఉన్నతదశకి చేరిన కవిత్వానికి ఒక గీటురాయి. - దేవిప్రియ© 2017,www.logili.com All Rights Reserved.