వాన కురిస్తే
నాలో కూడా కురిసేది.
ఉరుము ఉరిమితే
నాలోపల కూడా ఉరిమేది
మెరుపు మెరిస్తే
నా లోపల కూడా మెరిసేది.
వాగులూ వంకలూ
ఉన్మాదంగా ఊగుతున్న చెట్లు
చీకటి మూసిన ఆకాశాలు
తళ తళ మిరుమిట్లు
ఫెళ ఫెళ భగ్నతరు విస్ఫోటనలూ
అన్ని నా లోపల కూడా
ప్రజ్వలించేవి ప్రతిధ్వనించేవి
అపుడు నేను వేరు
తాను వేరూ కానట్టుండేది
ఇపుడేమిటి ఇలా?
ఏరు ఎవరోలా అనిపిస్తోంది
ఎవరో ఏరులా కనిపిస్తుంది.