చిరంజీవి డా. నారాయణరెడ్డి మాకు పుత్రప్రాప్యపరాజయానందము కలిగించిన శిష్యచూడమణి. అతని హృన్మర్దవమును వాఙ్మధుర్యమును గ్రహించి వలచి కవితాకన్య స్వయముగా వరించినది. ఆమె పులపుజూపుల పాలవెల్లిలో నోలలాడి యతడు సరసమధురములైన కబ్బములు పెక్కు సృజించి యాంధ్రభాషయేష కాభినవలంకృతులు కల్పించినాడు. ఆ యలంకారముల కమనీయ కాంతులతో నతని యశస్సౌరభములు తెలుగు నేల నలువలంకుల నలముకొని రసికజన హృదయారవిందముల నానంద మకరంద తుందిలముల నొనరించినవి . అతని కవిత్వపు వేఱుగులు సహృదయులకు కర్ణభూషణములు, గురువులైన మాకు గర్వకారణములునైనవి .