రెండు దశాబ్దాల కవిత్వాన్వేషణలో...
వర్తమాన సామాజిక చరిత్రను రికార్డు చేసే కవిత్వం కోసం చేస్తున్న అన్వేషణ విజయవాడ సాహితీ మిత్రులు కొనసాగిస్తూనే ఉన్నారు. కవుల కవిత్వం నుంచే గతకాలపు చరిత్రను పునర్నిర్మించుకున్నామనేది అందరికీ తెలిసిన విషయమే. చరిత్రను అనేక కోణాలలో రికార్డు చేయడం ఇప్పుడు నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. అయితే కవులు తమ కవిత్వం ద్వారా చరిత్రను నిర్మిస్తే, అది సాక్ష్యాలు నిరూపించాల్సిన అవసరం లేని చరిత్రగా రూపొందుతుంది. అయితే వర్తమాన కవులు ఆ పనిని సజావుగా సక్రమంగా చేస్తున్నారా అనేది పరిశీలనార్హమైన అంశం. ఊపిరాడనియ్యని వ్యవస్థను బద్దలు కొట్టడానికి ప్రపంచవ్యాప్తంగా సృజనకారులు కృషి చేస్తున్న తరుణంలో, తెలుగునాట అది ప్రతిబింబిస్తున్నదా అంటే అంత సమర్థవంతంగా లేదనే జవాబు మనకు ఎదురవుతుంది. 2022లో వచ్చిన కవిత్వాన్ని పరిశీలిస్తే ఇటువంటి ముగింపు మనకు కనిపిస్తుంది. ప్రగతిశీల దృక్పథం వైపు అడుగులు వేయాల్సిన తెలుగు కవిత్వం భిన్న వాదాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా విడిపోయి కనబడడం ఒక విషాదం. విడివిడిగా తమ తమ అస్తిత్వాల కోసం పోరాడుతూ, సమష్టిగా ప్రగతిశీల వాదం వైపు పయనమవ్వాల్సిన స్థితి నుండి వైషమ్యాల దిశగా ప్రయాణం చేయడం ఇప్పుడున్న పరిస్థితి. నిజానికి వ్యవస్థలో ఇప్పుడు కనబడుతున్న అణిచివేత, హరాస్మెంట్, అర్రెస్ట్ ల మీద గళం విప్పాల్సిన కవులు తగినంతగా స్పందించడం లేదేమో అనిపిస్తుంది. 2020లో వివిధ పత్రికలలో ప్రచురితమైన సుమారు 1800కు పైగా కవితలను పరిశీలించగా వాటిలో ఎక్కువ భాగం వ్యక్తిగతమైన అంశాలను కవిత్వీకరించిన కవులే ఎక్కువమంది కనబడుతున్నారు. "అణువణువునా నా కలాన్ని/ఆవరించుకున్న నవ్వుల పువ్వుల రేరాణి/ఈ కవితా ప్రక్రియకు ఊపిరిలూదిన/ ఊహా సుందరి నా ఊహలకే/ఊపిరులు అందించిన మరుమల్లె/ మరులు గొలిపే కురులలో/పువ్వుల జాతర ప్రత్యేకం/ ఓ... నవ్వులరేరాణీ/ ఓ.. పూబోణి/ ఓ... 3 వనిత" లాంటి కవితలే అనేకం ఉన్నాయి. కవులు క్రాంత దర్శులు కదా! వర్తమానాన్ని కవిత్వంలోకి తర్జుమా చేస్తూనే మానవాళి భావి చిత్రపటాన్ని కూడా కళ్ళ ముందు..............
రెండు దశాబ్దాల కవిత్వాన్వేషణలో... వర్తమాన సామాజిక చరిత్రను రికార్డు చేసే కవిత్వం కోసం చేస్తున్న అన్వేషణ విజయవాడ సాహితీ మిత్రులు కొనసాగిస్తూనే ఉన్నారు. కవుల కవిత్వం నుంచే గతకాలపు చరిత్రను పునర్నిర్మించుకున్నామనేది అందరికీ తెలిసిన విషయమే. చరిత్రను అనేక కోణాలలో రికార్డు చేయడం ఇప్పుడు నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. అయితే కవులు తమ కవిత్వం ద్వారా చరిత్రను నిర్మిస్తే, అది సాక్ష్యాలు నిరూపించాల్సిన అవసరం లేని చరిత్రగా రూపొందుతుంది. అయితే వర్తమాన కవులు ఆ పనిని సజావుగా సక్రమంగా చేస్తున్నారా అనేది పరిశీలనార్హమైన అంశం. ఊపిరాడనియ్యని వ్యవస్థను బద్దలు కొట్టడానికి ప్రపంచవ్యాప్తంగా సృజనకారులు కృషి చేస్తున్న తరుణంలో, తెలుగునాట అది ప్రతిబింబిస్తున్నదా అంటే అంత సమర్థవంతంగా లేదనే జవాబు మనకు ఎదురవుతుంది. 2022లో వచ్చిన కవిత్వాన్ని పరిశీలిస్తే ఇటువంటి ముగింపు మనకు కనిపిస్తుంది. ప్రగతిశీల దృక్పథం వైపు అడుగులు వేయాల్సిన తెలుగు కవిత్వం భిన్న వాదాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా విడిపోయి కనబడడం ఒక విషాదం. విడివిడిగా తమ తమ అస్తిత్వాల కోసం పోరాడుతూ, సమష్టిగా ప్రగతిశీల వాదం వైపు పయనమవ్వాల్సిన స్థితి నుండి వైషమ్యాల దిశగా ప్రయాణం చేయడం ఇప్పుడున్న పరిస్థితి. నిజానికి వ్యవస్థలో ఇప్పుడు కనబడుతున్న అణిచివేత, హరాస్మెంట్, అర్రెస్ట్ ల మీద గళం విప్పాల్సిన కవులు తగినంతగా స్పందించడం లేదేమో అనిపిస్తుంది. 2020లో వివిధ పత్రికలలో ప్రచురితమైన సుమారు 1800కు పైగా కవితలను పరిశీలించగా వాటిలో ఎక్కువ భాగం వ్యక్తిగతమైన అంశాలను కవిత్వీకరించిన కవులే ఎక్కువమంది కనబడుతున్నారు. "అణువణువునా నా కలాన్ని/ఆవరించుకున్న నవ్వుల పువ్వుల రేరాణి/ఈ కవితా ప్రక్రియకు ఊపిరిలూదిన/ ఊహా సుందరి నా ఊహలకే/ఊపిరులు అందించిన మరుమల్లె/ మరులు గొలిపే కురులలో/పువ్వుల జాతర ప్రత్యేకం/ ఓ... నవ్వులరేరాణీ/ ఓ.. పూబోణి/ ఓ... 3 వనిత" లాంటి కవితలే అనేకం ఉన్నాయి. కవులు క్రాంత దర్శులు కదా! వర్తమానాన్ని కవిత్వంలోకి తర్జుమా చేస్తూనే మానవాళి భావి చిత్రపటాన్ని కూడా కళ్ళ ముందు..............© 2017,www.logili.com All Rights Reserved.