పుష్పవిలాపమో బతుకు విషాదమో. నీ జనమే పోరాడుతున్నచోట కనీసం గొంతైనా కలవకపోవడం నేరం. కవిత ఆచరణకు సాటిరాదు. అయితేగియితే ఒక సహానుభూతి. ఒక విధాన అనుసరణ. ఒక ధైర్యవచనం. ఒక నినాద రచన. ఇది మరణిస్తున్న పాటను చూస్తూ వ్యధలోతుల్లోకి కూరుకుపోతున్న హృదయం. ఇది మరణవాంగ్మూలం వినిపించడం మాత్రమే, మి లార్డ్! ఆపై రేల పాట ఫీనిక్స్ వలె అవకాశం నుంచి మళ్ళీ ధ్వనిస్తుంది. దిక్కులు పిక్కటిల్లి దేహాలు దద్దరిల్లి జలాశయం గజగజ వనుకుతుంది. ఎప్పుడో ఒకప్పుడు 'అభివృద్ధి నమూనా' మిమ్మల్ని కూడా ముంచేస్తుంది. గోదాట్లో కలిసిపోతారొరేయ్. ఇది డెత్ సెంటెన్స్.
- అరుణ్ సాగర్
పుష్పవిలాపమో బతుకు విషాదమో. నీ జనమే పోరాడుతున్నచోట కనీసం గొంతైనా కలవకపోవడం నేరం. కవిత ఆచరణకు సాటిరాదు. అయితేగియితే ఒక సహానుభూతి. ఒక విధాన అనుసరణ. ఒక ధైర్యవచనం. ఒక నినాద రచన. ఇది మరణిస్తున్న పాటను చూస్తూ వ్యధలోతుల్లోకి కూరుకుపోతున్న హృదయం. ఇది మరణవాంగ్మూలం వినిపించడం మాత్రమే, మి లార్డ్! ఆపై రేల పాట ఫీనిక్స్ వలె అవకాశం నుంచి మళ్ళీ ధ్వనిస్తుంది. దిక్కులు పిక్కటిల్లి దేహాలు దద్దరిల్లి జలాశయం గజగజ వనుకుతుంది. ఎప్పుడో ఒకప్పుడు 'అభివృద్ధి నమూనా' మిమ్మల్ని కూడా ముంచేస్తుంది. గోదాట్లో కలిసిపోతారొరేయ్. ఇది డెత్ సెంటెన్స్. - అరుణ్ సాగర్© 2017,www.logili.com All Rights Reserved.