ఆంద్ర ప్రదేశ్ లో అనుదినం అనుక్షణం అన్నిదిశాలా అందరి నోటా మర్మోగుతున్న ఒకే ఒక్క పదం – ప్రత్యేక హోదా!
అగ్నికణమై చైతన్యజ్వాల రగిలిస్తున్నపదం – ప్రత్యేక హోదా!
అన్ని పార్టీలనూ అందరు నాయకులను చొక్కా పట్టుకుని నిలదీసి మీరు ఎటున్నారని ప్రశ్నిస్తున్న పదం ప్రత్యేక హోదా!
ఒక్క బిజెపి మినహా ప్రతివారూ ఏదో రూపంలో ఎంతో కొంత పలకవలసి వచ్చిన పదం – ప్రత్యేక హోదా!
ఎన్నికలకు ముందు పుట్టి మరో ఎన్నికల సంవత్సరం దాకా ప్రాణాలతో ఉండి ప్రాణం తీసేంత బలంగా నిలదీస్తున్న పదం – ప్రత్యేక హోదా!
కూటములను కూలగొట్టి కుటిలత్వాలను బయటపెట్టి కుళ్లు కుతంత్రాల రాజకీయాలను వెంటాడుతున్న పదం – ప్రత్యేక హోదా!
రెండు తెలుగు రాష్ట్రాల పాలక ప్రతిపక్షాలన్నిటి సామూహిక నినాదంగా మారింది – ప్రత్యేక హోదా!
ప్రత్యేక హోదా అంటే ఇప్పుడు కేవలం మాట కాదు పోరాట బావుటా.
ప్రత్యేక హోదా అన్నది విభజిత రాష్ట్ర విచారగ్రస్త గాథ. వంచిత ప్రజానీకం హృదయ ఘోష ఉద్యమకారుల ఉమ్మడి కేక.