ప్రసిద్ధ కథకురాలు, నవలా రచయిత్రి, కాలమిస్టు కుప్పిలి పద్మ ఫేస్ బుక్ మాధ్యమంద్వారా స్నేహితులతో పంచుకున్న కవితల సంకలనమిది. సమకాలిక తెలుగు సాహిత్య ప్రపంచంలో ఆమె అరుదైన భావుకురాలు. అక్షరరమణీయతకు పెట్టింది పేరు. ఋతుసౌందర్యం కాన్వాసుగా చిత్రించిన సున్నితమైన మనోభావాల వర్ణసముదాయం ఈ కవిత్వం. ఉదయాస్తమయ వేళలు, పువ్వులు, పక్షులు, పాటలు తోడుగా ఎదురుచూపులు, కలయికలు, విడిపోడాలు, ఊహలూ, జ్ఞాపకాలతో అల్లిన కలనేత, తలపోత, ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టడం నిండుగా పూసిన తురాయిచెట్టుని చూస్తూ ఒక వేసవి మొత్తం గడపడంలాంటి అనుభవం.
- కుప్పిలి పద్మ