వినుకొండ గుండెల్లోంచి......
జలపాతం పాయలు పాయలుగా దూకుతుంది. వాగు పాయలు పాయలుగా ఉరుకుతుంది. పాయలతో వాల్జడ అల్లుకుంటుంది. పాయలు విడిగా కనిపించినా ఒక వ్యవస్థను రూపొందిస్తాయి. ఈ నానీల పాయలూ అంతే! కె.జె. రమేష్ రచించిన ఈ నానీల పాయలు నానీల ప్రపంచంలోకి మరో తాజా చేర్పు.
ఇటీవలే నానీలు 'నన్హేముక్తక్' పేరుతో హిందీలోకి అనువాద రూపంలో వెళ్ళాయి. ఇవి హిందీలో 'చౌఖేచౌపదు' ల లాంటివని హిందీ భాషా కోవిదులు పేర్కొన్నారు. హిందీలో ఇట్లాంటి కవితారూపాలు ఇంకా ఉన్నాయి. దోహా, చౌపది ఇలా. తులసీ రామచరిత మానస్ చౌపదుల్లోనే సాగింది. కబీరు దోహాలు మనకు తెలిసినవే. అయితే వాటికి ఛందస్సు ఉంది. నన్హే అంటే చిన్న అని అర్థం. ముద్దోచ్చే అని కూడా. 'ముక్తక్' అంటే ముక్తకం అంటే వేటికవి స్వతంత్రమైనవి. తెలుగులో నానీలకు ఛందస్సు ఉండదు. అక్షర సంఖ్య, పాదనియతి, అంతర్గత నిర్మాణం ఉంటాయి. నానీ వచన కవితలో భాగమే. రమేష్తో సహా ఇప్పటివరకు 30 నానీ సంకలనాలు వెలువడి వుంటాయి. మూడు నాలుగు అచ్చులోవున్నాయి. ఒక వందకుపైగా విడిగా పత్రికల్లో రాశారు. గత ఎనిమిదేళ్ళలో ఒక ప్రత్యేక కవితారూపంగా స్థిరపడి అనేకమంది కవులను ఆకర్షించింది.
నానీ నానీయే కాని వీటిలో రమేష్ కంఠస్వరం అతనిదే. నానీ ప్రక్రియ తలామలకమయ్యింది. సమకాలీన స్ఫూర్తితో, ఆర్తితో, ఊహాశాలిత్వంతో రమేష్ నానీలు సాగాయి. చూడండి...............................
వినుకొండ గుండెల్లోంచి...... జలపాతం పాయలు పాయలుగా దూకుతుంది. వాగు పాయలు పాయలుగా ఉరుకుతుంది. పాయలతో వాల్జడ అల్లుకుంటుంది. పాయలు విడిగా కనిపించినా ఒక వ్యవస్థను రూపొందిస్తాయి. ఈ నానీల పాయలూ అంతే! కె.జె. రమేష్ రచించిన ఈ నానీల పాయలు నానీల ప్రపంచంలోకి మరో తాజా చేర్పు. ఇటీవలే నానీలు 'నన్హేముక్తక్' పేరుతో హిందీలోకి అనువాద రూపంలో వెళ్ళాయి. ఇవి హిందీలో 'చౌఖేచౌపదు' ల లాంటివని హిందీ భాషా కోవిదులు పేర్కొన్నారు. హిందీలో ఇట్లాంటి కవితారూపాలు ఇంకా ఉన్నాయి. దోహా, చౌపది ఇలా. తులసీ రామచరిత మానస్ చౌపదుల్లోనే సాగింది. కబీరు దోహాలు మనకు తెలిసినవే. అయితే వాటికి ఛందస్సు ఉంది. నన్హే అంటే చిన్న అని అర్థం. ముద్దోచ్చే అని కూడా. 'ముక్తక్' అంటే ముక్తకం అంటే వేటికవి స్వతంత్రమైనవి. తెలుగులో నానీలకు ఛందస్సు ఉండదు. అక్షర సంఖ్య, పాదనియతి, అంతర్గత నిర్మాణం ఉంటాయి. నానీ వచన కవితలో భాగమే. రమేష్తో సహా ఇప్పటివరకు 30 నానీ సంకలనాలు వెలువడి వుంటాయి. మూడు నాలుగు అచ్చులోవున్నాయి. ఒక వందకుపైగా విడిగా పత్రికల్లో రాశారు. గత ఎనిమిదేళ్ళలో ఒక ప్రత్యేక కవితారూపంగా స్థిరపడి అనేకమంది కవులను ఆకర్షించింది. నానీ నానీయే కాని వీటిలో రమేష్ కంఠస్వరం అతనిదే. నానీ ప్రక్రియ తలామలకమయ్యింది. సమకాలీన స్ఫూర్తితో, ఆర్తితో, ఊహాశాలిత్వంతో రమేష్ నానీలు సాగాయి. చూడండి...............................© 2017,www.logili.com All Rights Reserved.