వినుకొండ నుండి విశ్వనరుడు
(1895-1971)
జాషువా జీవితం - కవిత్వం:
జాషువా మహాకవి, పండిత కవి. వినుకొండలో పుట్టి, నవయుగ కవి చక్రవర్తిగా పిలిపించుకున్న కవి. సరస్వతీ మానసపుత్రుడు. వాగ్దేవి దీవెనలు ఘనంగా అందుకున్న కవిరాజు. కవిత్వాన్ని కరవాలంగా ధరించిన కవితాయోధుడు. పలువురి పెద్దలు, పండితులచే ప్రశంసలందు కున్న కవివరేణ్యులు. తనకు అనుకూలంగాని వాతావరణంలో పెరిగినా, కవిత్వంతో తనకు అనుకూల వాతావరణం సృష్టించుకున్న మహామనిషి, కవికోకిల. అసమానతలు, పేదరికం వర్ణ దురహంకారం, కులతత్వం వీరిని వెంటాడి వెంటాడి వేధించినా మొక్కవోని ధైర్యంతో, పద్య కవిత్వంతో, తన బుద్ధి కుశలతతో వాటిని ఎదుర్కొని విజయం సాధించిన కవి పుంగవుడు. కవికి దార్శనికత ఉండాలి. అపార మేథస్సు వుండాలి. కవి తాను బోధించిన, చెప్పిన విషయాలను ఆచరించగలిగే నేర్పు, ఓర్పు, చిత్త శుద్ది ఉండాలి. ఇవన్నీ జాషువాలో పుష్కలంగా ఉన్నాయి. ఇన్ని ప్రత్యేకతలు వున్నవి గనుకనే జాషువా కవిగా రాణించాడు, ప్రముఖ కవుల సరసన చేరాడు.
జాషువా గారి గురించి ఎందరో పెద్దలు, నాటి ప్రముఖ కవులు శ్రీ చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి, 'కరుణశ్రీ' జంధ్యాల పాపయ్యశాస్త్రి, దాశరధి, సి. నారాయణరెడ్డి వంటి దిగ్దంతులు ప్రశంసలతో ముంచెత్తారు. ఇంత ఖ్యాతి నార్జించిన కవి గుర్రం జాషువా కవిత్వాన్ని, జీవితాన్ని సంక్షిప్తంగా పరిశీలిద్దాం.
వినుకొండ సమీపంలో గల చాట్రగడ్డపాడు జాషువా స్వస్థలం. 1895 సెప్టెంబరు, 28న వినుకొండలోని మిస్సమ్మ తోటనందు
వినుకొండ నుండి విశ్వనరుడు (1895-1971) జాషువా జీవితం - కవిత్వం: జాషువా మహాకవి, పండిత కవి. వినుకొండలో పుట్టి, నవయుగ కవి చక్రవర్తిగా పిలిపించుకున్న కవి. సరస్వతీ మానసపుత్రుడు. వాగ్దేవి దీవెనలు ఘనంగా అందుకున్న కవిరాజు. కవిత్వాన్ని కరవాలంగా ధరించిన కవితాయోధుడు. పలువురి పెద్దలు, పండితులచే ప్రశంసలందు కున్న కవివరేణ్యులు. తనకు అనుకూలంగాని వాతావరణంలో పెరిగినా, కవిత్వంతో తనకు అనుకూల వాతావరణం సృష్టించుకున్న మహామనిషి, కవికోకిల. అసమానతలు, పేదరికం వర్ణ దురహంకారం, కులతత్వం వీరిని వెంటాడి వెంటాడి వేధించినా మొక్కవోని ధైర్యంతో, పద్య కవిత్వంతో, తన బుద్ధి కుశలతతో వాటిని ఎదుర్కొని విజయం సాధించిన కవి పుంగవుడు. కవికి దార్శనికత ఉండాలి. అపార మేథస్సు వుండాలి. కవి తాను బోధించిన, చెప్పిన విషయాలను ఆచరించగలిగే నేర్పు, ఓర్పు, చిత్త శుద్ది ఉండాలి. ఇవన్నీ జాషువాలో పుష్కలంగా ఉన్నాయి. ఇన్ని ప్రత్యేకతలు వున్నవి గనుకనే జాషువా కవిగా రాణించాడు, ప్రముఖ కవుల సరసన చేరాడు. జాషువా గారి గురించి ఎందరో పెద్దలు, నాటి ప్రముఖ కవులు శ్రీ చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి, 'కరుణశ్రీ' జంధ్యాల పాపయ్యశాస్త్రి, దాశరధి, సి. నారాయణరెడ్డి వంటి దిగ్దంతులు ప్రశంసలతో ముంచెత్తారు. ఇంత ఖ్యాతి నార్జించిన కవి గుర్రం జాషువా కవిత్వాన్ని, జీవితాన్ని సంక్షిప్తంగా పరిశీలిద్దాం. వినుకొండ సమీపంలో గల చాట్రగడ్డపాడు జాషువా స్వస్థలం. 1895 సెప్టెంబరు, 28న వినుకొండలోని మిస్సమ్మ తోటనందు© 2017,www.logili.com All Rights Reserved.