ఈ పుస్తకంలో, రెండూ పుస్తకములు ఇమిడి వున్నాయి . పుస్తకమునకు ముందు ప్రక్క పాదం కింద కాలం . వెనుక ప్రక్క ప్రముఖ గీతం
ఎరుపెక్కిన పాదాలకింద కాలానికి వందనం
మానవ సమూహాల పాదాలకింద దేశంవెంట దేశం, మొత్తం భూగోళమంతా నడుస్తున్న నెత్తుటితో తడిసిన పగుళ్ళనేలను, ఒక విషాద భూమిని కవిత్వ పాదాల కింద పరిచి గుండెను పిండేయడం కాకపోతే ప్రసాదమూర్తి చేసిన పనేమిటి?
దేహాల గుంపుల్లోకి దేశాలు వలస పోతున్నాయా? దేశదేహాల్లో గుంపులు గుంపులగా, మందలు మందలుగా, వందలుగా, వేలూ లక్షలుగా, కోట్లుగా మానవ కళేబరాలు రాలిపడి కుళ్ళి పోయిన దుర్భర సన్నవేశాల్ని దృశ్యాలు దృశ్యాలుగా కళ్ళకు కట్టడం కాకపోతే ఈ కవి చేస్తున్నదేమిటి?
దేహాలను దేహాలతో పట్టుకుని పరుగులు తీసే వలస దుఃఖాన్ని మన గుండెల్లో వొంపి, తొణికిసలాడే కన్నీటి కుండల్ని మూత తీసి చూపించడం కాకపోతే ఈ మానవుడు చూపేదేమిటి?
సృష్ట్యాది నుంచీ ఇప్పటి దాకా మనిషి కాళ్ళకింద నలిగిన కాలాన్ని, నడిచిన భూగోళాన్ని తన కవిత్వ వాక్యాల కత్తుల అంచుల మీదికి తెచ్చి మన చూపుల వేళ్ళకు నెత్తుటి తడి అంటించడం కాకపోతే ఏమిటిది?
జాతీయ రహదారులే జాతీయ గీతాలుగా ఆలపించే, పదాల గారడీలు తెలీని, పాదాల పగుళ్ళలోంచి స్రవించే రుధిర ప్రవాహాలనే రసవద్విలాప వాక్యాలుగా మలచడం కాకపోతే ఇదేమిటి?.............
ఈ పుస్తకంలో, రెండూ పుస్తకములు ఇమిడి వున్నాయి . పుస్తకమునకు ముందు ప్రక్క పాదం కింద కాలం . వెనుక ప్రక్క ప్రముఖ గీతం ఎరుపెక్కిన పాదాలకింద కాలానికి వందనం మానవ సమూహాల పాదాలకింద దేశంవెంట దేశం, మొత్తం భూగోళమంతా నడుస్తున్న నెత్తుటితో తడిసిన పగుళ్ళనేలను, ఒక విషాద భూమిని కవిత్వ పాదాల కింద పరిచి గుండెను పిండేయడం కాకపోతే ప్రసాదమూర్తి చేసిన పనేమిటి? దేహాల గుంపుల్లోకి దేశాలు వలస పోతున్నాయా? దేశదేహాల్లో గుంపులు గుంపులగా, మందలు మందలుగా, వందలుగా, వేలూ లక్షలుగా, కోట్లుగా మానవ కళేబరాలు రాలిపడి కుళ్ళి పోయిన దుర్భర సన్నవేశాల్ని దృశ్యాలు దృశ్యాలుగా కళ్ళకు కట్టడం కాకపోతే ఈ కవి చేస్తున్నదేమిటి? దేహాలను దేహాలతో పట్టుకుని పరుగులు తీసే వలస దుఃఖాన్ని మన గుండెల్లో వొంపి, తొణికిసలాడే కన్నీటి కుండల్ని మూత తీసి చూపించడం కాకపోతే ఈ మానవుడు చూపేదేమిటి? సృష్ట్యాది నుంచీ ఇప్పటి దాకా మనిషి కాళ్ళకింద నలిగిన కాలాన్ని, నడిచిన భూగోళాన్ని తన కవిత్వ వాక్యాల కత్తుల అంచుల మీదికి తెచ్చి మన చూపుల వేళ్ళకు నెత్తుటి తడి అంటించడం కాకపోతే ఏమిటిది? జాతీయ రహదారులే జాతీయ గీతాలుగా ఆలపించే, పదాల గారడీలు తెలీని, పాదాల పగుళ్ళలోంచి స్రవించే రుధిర ప్రవాహాలనే రసవద్విలాప వాక్యాలుగా మలచడం కాకపోతే ఇదేమిటి?.............© 2017,www.logili.com All Rights Reserved.