మహాకాలుడు
సేతబ్య నగరంలో బుద్ధభగవానుడు ధర్మోపన్యాసాలు చేస్తుండగా ఆయన బోధనలచే మిక్కిలి ప్రభావితుడై మహాకాలుడనే వర్తకుడు బుద్ధుని ఆశ్రయించి సన్యాసం తీసుకొన్నాడు. ఇది అతని సోదరుడు చూళకాలునికి నచ్చలేదు. సోదరుణ్ణి తిరిగి మామూలు మనిషిగా చేయాలనుకొన్నాడు. అది నెరవేరాలంటే తాను కూడ అతనితోనే ఉండాలి. కనుక తాను కూడ సన్యాసం తీసుకున్నాడు. వీరిద్దరూ వివాహితులే.
పరమ వైరాగ్యంతో మహాకాలుడు సన్యాస నియమాలను చక్కగా పాటిస్తూ బుద్ధుడు చెప్పిన అనిత్యచింతన మొదలగు సాధనల్లో చిత్రాన్ని 'నిలిపి అచిరకాలంలోనే అర్హత్వాన్ని పొందగలిగాడు.
కొంతకాలం తరువాత బుద్దుడు తన ధర్మచక్ర ప్రవర్తన కార్యక్రమంలో భాగంగా మళ్ళీ సేతబ్య నగర పరిసరాలకు విచ్చేస్తాడు. అప్పుడు చూళకాలుని భార్యకు ఒక ఉపాయం తట్టింది. బుద్ధుణ్ణి శిష్యసమేతంగా భిక్షకు ఆహ్వానించింది. ఆ ఆహ్వానాన్ని బుద్దుడు అంగీకరించాడు. భిక్ష ఏర్పాట్లు చేయడం తనకు కొత్త గనుక బౌద్ధభిక్షువుగా ఉంటున్న తన భర్త చూళకాలుని సహాయాన్ని కోరింది. చూళకాలుడు సమ్మతించి ఆ ఏర్పాట్ల విషయంలో సహాయమందించడానికి ఆమెతో వెళ్ళాడు.
భిక్షకు వచ్చిన సాధువులు వెళ్ళిపోయాక చేయవలసిన కార్యక్రమం ఒకటుంది. దాన్ని అనుమోదనం అంటారు. దాన్ని చూళకాలునికి అప్పగించి..............
మహాకాలుడు సేతబ్య నగరంలో బుద్ధభగవానుడు ధర్మోపన్యాసాలు చేస్తుండగా ఆయన బోధనలచే మిక్కిలి ప్రభావితుడై మహాకాలుడనే వర్తకుడు బుద్ధుని ఆశ్రయించి సన్యాసం తీసుకొన్నాడు. ఇది అతని సోదరుడు చూళకాలునికి నచ్చలేదు. సోదరుణ్ణి తిరిగి మామూలు మనిషిగా చేయాలనుకొన్నాడు. అది నెరవేరాలంటే తాను కూడ అతనితోనే ఉండాలి. కనుక తాను కూడ సన్యాసం తీసుకున్నాడు. వీరిద్దరూ వివాహితులే. పరమ వైరాగ్యంతో మహాకాలుడు సన్యాస నియమాలను చక్కగా పాటిస్తూ బుద్ధుడు చెప్పిన అనిత్యచింతన మొదలగు సాధనల్లో చిత్రాన్ని 'నిలిపి అచిరకాలంలోనే అర్హత్వాన్ని పొందగలిగాడు. కొంతకాలం తరువాత బుద్దుడు తన ధర్మచక్ర ప్రవర్తన కార్యక్రమంలో భాగంగా మళ్ళీ సేతబ్య నగర పరిసరాలకు విచ్చేస్తాడు. అప్పుడు చూళకాలుని భార్యకు ఒక ఉపాయం తట్టింది. బుద్ధుణ్ణి శిష్యసమేతంగా భిక్షకు ఆహ్వానించింది. ఆ ఆహ్వానాన్ని బుద్దుడు అంగీకరించాడు. భిక్ష ఏర్పాట్లు చేయడం తనకు కొత్త గనుక బౌద్ధభిక్షువుగా ఉంటున్న తన భర్త చూళకాలుని సహాయాన్ని కోరింది. చూళకాలుడు సమ్మతించి ఆ ఏర్పాట్ల విషయంలో సహాయమందించడానికి ఆమెతో వెళ్ళాడు. భిక్షకు వచ్చిన సాధువులు వెళ్ళిపోయాక చేయవలసిన కార్యక్రమం ఒకటుంది. దాన్ని అనుమోదనం అంటారు. దాన్ని చూళకాలునికి అప్పగించి..............© 2017,www.logili.com All Rights Reserved.