రాసి రాసి ఆ కలం ఇకలేనని
విస్వంతరాళంలో కలిసిపోయింది
మనసుకు స్పందన నేర్పిన
ఆ కవిత్వం
ఇక రానని
మృత్యుగుహలో కొరిగిపోయింది
భాష ఉన్నంతకాలం..
చరిత్రలో తానేనని చెప్పుకుపోయింది
మజిలీ మజిలీకి శిఖరాల్ని తాకుతూ
కవిత్వపు స్మృతుల్ని
మళ్ళి మళ్ళి స్పర్శిస్తూ
గతాన్ని వటమనాన్ని
అనుసంధానిస్తూ
విమర్శల వలయాల్లోను
ఆ గొంతు ప్రభంజనాల్ని సృష్టించి
లక్ష్యం ఆకాశంగా సాగిపోయింది
అక్షరాలు ఉన్నంతకాలం..
కట్టుకయ్యగా తన ఉనికిని దిగేసి
జ్ఞాపకాల విత్తనాల్ని
నెలంతా జల్లేసి
మెరుపుపువ్వై నక్షత్రాల వైపు
ఎగిరిపోయింది!
- ఉండవల్లి ఎమ్