శ్రామిక విప్లవసాహిత్యా నికి 70ఏళ్ళు
కపజీవికి రెండు వైపులా అండదండగా నిలిచేవాడే నేటి కవి అని ఆధునిక కవికి అధునాతన నిర్వచనం యిచ్చిన శ్రీశ్రీ భౌతికంగా మన నుండి దూరమై అప్పుడే 24 సంవత్స రాలు
యింది. 2010 ఏప్రిల్ 30వ తేదికి ఆయన పుట్టి నూరు సంవత్సరాల వుతుంది. మూడు సంవత్సరాల ముందుగానే శ్రీశ్రీ శతజయంతి గురించిన నిరంతరాయ కారకము పథక రచన ఒక వైపు సాగుతోంది. శ్రీశ్రీ కవిత్వాభిమానులూ, భావోద్వేగ సన్నిహితులు, లకు సాధనావేశితులూ కలసి శ్రీశ్రీని నూతన తరాలకు ఎంతగా పరిచయం చేస్తే అంతగా తల పెట్టిన కార్యం నెరవేరినట్టు.
తెలుగు కవిత్వాన్ని విప్లవీకరించినవాడు శ్రీశ్రీ. విప్లవాన్ని కవిత్వీకరించి తెలుగు జాతి జనులు పాడుకునే సంగీతంలా మార్చినవాడు శ్రీశ్రీ.
నూతన తరాలను పుట్టుకతోనే వృద్ధులుగా మార్చే కళలో ఆరితేరిన దోపిడీ వ్యవస్థకూ, శతాబ్దాల తరబడి కుళ్లికంపుకొడుతున్న సంస్కరణావాదపు మాట్లుతో, చిట్టి పొట్టి సంస్కరణలతో భయానకంగా ప్రజలను వంచిస్తున్న నానావిధ పాలకముఠాల గిరీశత్వాలకూ, సాహితీ విరుగుడు 'మహాప్రస్థానం' కావ్యం . అది నేటికి దివ్యౌషధమే. అది “కదిలేది, కదిలించేది...... పెనునిద్దర వదిలించేది"... "పదండి ముందుకు పడండి త్రోసుకు, నదీనదాలు అడవులు, కొండలు ఎడారులా మనకడ్డంకి" అంటూ వయోవృద్ధులలో కూడా ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని రేకెత్తించేది. అందుకే శ్రీశ్రీ కన్నా శ్రీశ్రీ కవిత్వం గొప్పది.
శ్రీశ్రీ అనే తాడిచెట్టులోని చేవ 'మహాప్రస్థానం'. ఈ కావ్యంలోని 41 గీతాలూ 1933 నుండి 1947 దాకా, 15 సంవత్సరాల కాలంలోనే రాసినవి. 'నీడలు' అన్న కవిత ఒక్కటే! 1941 తర్వాత రాసినది.
1937వ సంవత్సరం శ్రీశ్రీ సాహిత్యజీవితంలో ఒక మైలురాయి. ఆ ఏడాదిలో ఆయన కవితలు రాశాడు. అవి రాసి నేటికి సరిగా 70 సంవత్సరాలు. కనుక దీన్నిక సందర్భంగా కూడా భావించవచ్చు. 'కవితా! ఓ కవితా!', 'ప్రతిజ్ఞ'తో పాటు 'చేదుపాట', 'అభ్యుదయం', మిధ్యావాది', 'నవకవిత', 'వాడు', 'వ్యత్యాసం' ఆ ఎనిమిదింటిలో వున్నాయి. వీటిలో అంతకు మునుపు ఏ సంవత్సరంలోని కవితలలోకన్నా అవగాహనలో, దృక్పథంలో, నిర్దుష్టతలో, ఎంపికలో, కవితా శిల్పాభివ్యకిలో, మెరుగైన పరిపక్వతను మనం గ్రహించవచ్చు. మార్క్సిజం ప్రభావం నుండి మార్చిను అవగాహనను సంతరించుకున్నట్లుగా మనం గ్రహించవచ్చు. ఇవి రాసే నాటికి శ్రీశ్రీకి కేవలం 27 ఏండ్లు మాత్రమే!
కవిత్వం తననెలా ఆవహించింది. తనకు ఏఏ జీవిత సత్యాలను, విప్లవ చైతన్యాలను, పు విశ్వరూపాలను సాక్ష్యాత్కరింపజేసిందో, తన నుండి కవితాఝరి ఎలా వెలువ
శ్రామిక విప్లవసాహిత్యా నికి 70ఏళ్ళు కపజీవికి రెండు వైపులా అండదండగా నిలిచేవాడే నేటి కవి అని ఆధునిక కవికి అధునాతన నిర్వచనం యిచ్చిన శ్రీశ్రీ భౌతికంగా మన నుండి దూరమై అప్పుడే 24 సంవత్స రాలు యింది. 2010 ఏప్రిల్ 30వ తేదికి ఆయన పుట్టి నూరు సంవత్సరాల వుతుంది. మూడు సంవత్సరాల ముందుగానే శ్రీశ్రీ శతజయంతి గురించిన నిరంతరాయ కారకము పథక రచన ఒక వైపు సాగుతోంది. శ్రీశ్రీ కవిత్వాభిమానులూ, భావోద్వేగ సన్నిహితులు, లకు సాధనావేశితులూ కలసి శ్రీశ్రీని నూతన తరాలకు ఎంతగా పరిచయం చేస్తే అంతగా తల పెట్టిన కార్యం నెరవేరినట్టు. తెలుగు కవిత్వాన్ని విప్లవీకరించినవాడు శ్రీశ్రీ. విప్లవాన్ని కవిత్వీకరించి తెలుగు జాతి జనులు పాడుకునే సంగీతంలా మార్చినవాడు శ్రీశ్రీ. నూతన తరాలను పుట్టుకతోనే వృద్ధులుగా మార్చే కళలో ఆరితేరిన దోపిడీ వ్యవస్థకూ, శతాబ్దాల తరబడి కుళ్లికంపుకొడుతున్న సంస్కరణావాదపు మాట్లుతో, చిట్టి పొట్టి సంస్కరణలతో భయానకంగా ప్రజలను వంచిస్తున్న నానావిధ పాలకముఠాల గిరీశత్వాలకూ, సాహితీ విరుగుడు 'మహాప్రస్థానం' కావ్యం . అది నేటికి దివ్యౌషధమే. అది “కదిలేది, కదిలించేది...... పెనునిద్దర వదిలించేది"... "పదండి ముందుకు పడండి త్రోసుకు, నదీనదాలు అడవులు, కొండలు ఎడారులా మనకడ్డంకి" అంటూ వయోవృద్ధులలో కూడా ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని రేకెత్తించేది. అందుకే శ్రీశ్రీ కన్నా శ్రీశ్రీ కవిత్వం గొప్పది. శ్రీశ్రీ అనే తాడిచెట్టులోని చేవ 'మహాప్రస్థానం'. ఈ కావ్యంలోని 41 గీతాలూ 1933 నుండి 1947 దాకా, 15 సంవత్సరాల కాలంలోనే రాసినవి. 'నీడలు' అన్న కవిత ఒక్కటే! 1941 తర్వాత రాసినది. 1937వ సంవత్సరం శ్రీశ్రీ సాహిత్యజీవితంలో ఒక మైలురాయి. ఆ ఏడాదిలో ఆయన కవితలు రాశాడు. అవి రాసి నేటికి సరిగా 70 సంవత్సరాలు. కనుక దీన్నిక సందర్భంగా కూడా భావించవచ్చు. 'కవితా! ఓ కవితా!', 'ప్రతిజ్ఞ'తో పాటు 'చేదుపాట', 'అభ్యుదయం', మిధ్యావాది', 'నవకవిత', 'వాడు', 'వ్యత్యాసం' ఆ ఎనిమిదింటిలో వున్నాయి. వీటిలో అంతకు మునుపు ఏ సంవత్సరంలోని కవితలలోకన్నా అవగాహనలో, దృక్పథంలో, నిర్దుష్టతలో, ఎంపికలో, కవితా శిల్పాభివ్యకిలో, మెరుగైన పరిపక్వతను మనం గ్రహించవచ్చు. మార్క్సిజం ప్రభావం నుండి మార్చిను అవగాహనను సంతరించుకున్నట్లుగా మనం గ్రహించవచ్చు. ఇవి రాసే నాటికి శ్రీశ్రీకి కేవలం 27 ఏండ్లు మాత్రమే! కవిత్వం తననెలా ఆవహించింది. తనకు ఏఏ జీవిత సత్యాలను, విప్లవ చైతన్యాలను, పు విశ్వరూపాలను సాక్ష్యాత్కరింపజేసిందో, తన నుండి కవితాఝరి ఎలా వెలువ© 2017,www.logili.com All Rights Reserved.