శ్రీమద్రామాయణము, మహాభారతములలోని వ్యక్తులు, సంఘటనలు మన భారతజాతిని ప్రభావితం చేశాయి అన్నది సుస్పష్టం. ఛత్రపతి శివాజీ, మహాత్మాగాంధీ, స్వామివివేకానంద ఇంకెందరో మహానుభావులకు మార్గదర్శకమైనాయి. మన ఇళ్ళలో పసిపాపలు తల్లి ఒడిలో కూర్చొని తొలిపాఠాలు నేర్చుకునేది ఈ రామాయణ, భారత గాధలు వినే. సీతాదేవి, ద్రౌపదిదేవి పడిన కష్టాలు, శ్రీరాముడు, అర్జునుడు యొక్క వీరోచితకార్యాలు, లక్ష్మణుడు, ఆంజనేయుడు వంటి ప్రేమాస్పద వ్యక్తులు, కర్ణుని దానగుణము, ధర్మరాజు యొక్క ధర్మనిష్ఠ మానవుల తొలి అడుగులకు మార్గదర్శకంగా నిలుస్తాయి. కాలక్షేపం కొరకు ఉద్దేశింపబడిన హరికథలు, బుర్రకథలు, యక్షగానాలు, నాటకాలలో ఈ పాత్రల ఔన్నత్యాన్ని ప్రదర్శించబడతాయి. ఈ మహాపురాణాలు ఒక్క భారతదేశానికేగాక, సర్వప్రపంచానికి, అన్ని కాలాలకు ప్రతిబింబాలు. అలాగే మహాభారతములో నాయకత్వ లక్షణముల గురించి వివరింపబడింది.
శ్రీమద్రామాయణము, మహాభారతములలోని వ్యక్తులు, సంఘటనలు మన భారతజాతిని ప్రభావితం చేశాయి అన్నది సుస్పష్టం. ఛత్రపతి శివాజీ, మహాత్మాగాంధీ, స్వామివివేకానంద ఇంకెందరో మహానుభావులకు మార్గదర్శకమైనాయి. మన ఇళ్ళలో పసిపాపలు తల్లి ఒడిలో కూర్చొని తొలిపాఠాలు నేర్చుకునేది ఈ రామాయణ, భారత గాధలు వినే. సీతాదేవి, ద్రౌపదిదేవి పడిన కష్టాలు, శ్రీరాముడు, అర్జునుడు యొక్క వీరోచితకార్యాలు, లక్ష్మణుడు, ఆంజనేయుడు వంటి ప్రేమాస్పద వ్యక్తులు, కర్ణుని దానగుణము, ధర్మరాజు యొక్క ధర్మనిష్ఠ మానవుల తొలి అడుగులకు మార్గదర్శకంగా నిలుస్తాయి. కాలక్షేపం కొరకు ఉద్దేశింపబడిన హరికథలు, బుర్రకథలు, యక్షగానాలు, నాటకాలలో ఈ పాత్రల ఔన్నత్యాన్ని ప్రదర్శించబడతాయి. ఈ మహాపురాణాలు ఒక్క భారతదేశానికేగాక, సర్వప్రపంచానికి, అన్ని కాలాలకు ప్రతిబింబాలు. అలాగే మహాభారతములో నాయకత్వ లక్షణముల గురించి వివరింపబడింది.© 2017,www.logili.com All Rights Reserved.