వలయాల్నించి విముక్తికి ప్రేరణ
నేనూ-చీకటి నవల ద్వారా తెలుగు పాఠక ప్రపంచాన్ని విస్మయపరిచిన కాశీభట్ల వేణుగోపాల్ తన రచనా పరంపరని అదే శైలిలో కొనసాగిస్తున్నారు. తపన, దిగంతం, మంచుపువ్వు ఇప్పుడు తాజాగా తెరవని తలుపులు... ఇవన్నీ కూడా తెలుగు సాహిత్యంలో కొత్త కోణాల్ని రికార్డు చేసిన నవలలు. అప్పటి వరకు ఇతరులు స్మృశించని అంశాల్ని ఇతి వృత్తాలుగా తీసుకుని రాసిన నవలలు. పాఠకలోకాన్ని దిగ్భ్రామపరిచిన నవలలు. మర్యాదస్తుల మతి పోగొట్టిన నవలలు. ఇరవయ్యొకటో శతాబ్దంలో తెలుగు నవలకి మహర్దశని అందించిన నవలలు. ఈ నవలలన్నీ ఇంగ్లీషులోకి అనువాదం కావడం ఇవాళ ఎంతయినా అవసరం. తెలుగు నవల విశిష్టతని ప్రపంచానికి చాటడానికి ఇది తప్పనిసరి. వాదాల గానుగకి తమను తాము కట్టేసుకుని ఆ చట్రంలో తిరుగాడేవాళ్ళకి కాశీభట్ల నవలలు అర్ధం కావు. ఆయన రచనల్లోని తాత్వికాంశాల నిగూఢ రహస్యాల్ని వాళ్లు అవగతం చేసుకోలేరు. కానీ పాఠకులు వివేకులు. వారు ఆయన్ని స్వాగతించారు. మన కళ్ళముందు, మన ఎదుట ఒక విలక్షణ నవలాకారుడు జీవిస్తున్నాడన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించారు.
నేను తొలి నుంచి కూడా తన నవల ఏదైనా చదవడం మొదలెట్టాక పూర్తి చేయకుండా ఉండలేకపోయాను. ఇప్పుడు ఈ నవల 'తెరవని తలుపులు' విషయంలోనూ అదే అనుభవం. అంటే ఈ రచయిత తాజాదనాన్ని కోల్పోలేదు. తన కలం వాడి తగ్గిపోలేదు. సృజనాత్మక రచయితగా తను మరింత ఉత్సాహాన్ని, నవ్యతని సంతరించుకున్నారు. దాని తాలూకు సొగసు ఈ నవలలో కనిపిస్తుంది..
ఈ నవలలోని కథానాయకుడు ఆధునికత తెచ్చి పెట్టిన ఫలాన్ని అందుకున్నవాడు. బ్రాహ్మణుడు. కానీ అతనిది అబ్రాహ్మణజీవనశైలి. తాగుబోతు, చైన్ స్మోకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా 'మంచి' సంపాదన. అడక్కుండానే వేలు, లక్షలు సమకూరుతుంటాయి...........................
వలయాల్నించి విముక్తికి ప్రేరణ నేనూ-చీకటి నవల ద్వారా తెలుగు పాఠక ప్రపంచాన్ని విస్మయపరిచిన కాశీభట్ల వేణుగోపాల్ తన రచనా పరంపరని అదే శైలిలో కొనసాగిస్తున్నారు. తపన, దిగంతం, మంచుపువ్వు ఇప్పుడు తాజాగా తెరవని తలుపులు... ఇవన్నీ కూడా తెలుగు సాహిత్యంలో కొత్త కోణాల్ని రికార్డు చేసిన నవలలు. అప్పటి వరకు ఇతరులు స్మృశించని అంశాల్ని ఇతి వృత్తాలుగా తీసుకుని రాసిన నవలలు. పాఠకలోకాన్ని దిగ్భ్రామపరిచిన నవలలు. మర్యాదస్తుల మతి పోగొట్టిన నవలలు. ఇరవయ్యొకటో శతాబ్దంలో తెలుగు నవలకి మహర్దశని అందించిన నవలలు. ఈ నవలలన్నీ ఇంగ్లీషులోకి అనువాదం కావడం ఇవాళ ఎంతయినా అవసరం. తెలుగు నవల విశిష్టతని ప్రపంచానికి చాటడానికి ఇది తప్పనిసరి. వాదాల గానుగకి తమను తాము కట్టేసుకుని ఆ చట్రంలో తిరుగాడేవాళ్ళకి కాశీభట్ల నవలలు అర్ధం కావు. ఆయన రచనల్లోని తాత్వికాంశాల నిగూఢ రహస్యాల్ని వాళ్లు అవగతం చేసుకోలేరు. కానీ పాఠకులు వివేకులు. వారు ఆయన్ని స్వాగతించారు. మన కళ్ళముందు, మన ఎదుట ఒక విలక్షణ నవలాకారుడు జీవిస్తున్నాడన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించారు. నేను తొలి నుంచి కూడా తన నవల ఏదైనా చదవడం మొదలెట్టాక పూర్తి చేయకుండా ఉండలేకపోయాను. ఇప్పుడు ఈ నవల 'తెరవని తలుపులు' విషయంలోనూ అదే అనుభవం. అంటే ఈ రచయిత తాజాదనాన్ని కోల్పోలేదు. తన కలం వాడి తగ్గిపోలేదు. సృజనాత్మక రచయితగా తను మరింత ఉత్సాహాన్ని, నవ్యతని సంతరించుకున్నారు. దాని తాలూకు సొగసు ఈ నవలలో కనిపిస్తుంది.. ఈ నవలలోని కథానాయకుడు ఆధునికత తెచ్చి పెట్టిన ఫలాన్ని అందుకున్నవాడు. బ్రాహ్మణుడు. కానీ అతనిది అబ్రాహ్మణజీవనశైలి. తాగుబోతు, చైన్ స్మోకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా 'మంచి' సంపాదన. అడక్కుండానే వేలు, లక్షలు సమకూరుతుంటాయి...........................© 2017,www.logili.com All Rights Reserved.