మహాకవి జాషువ సాహిత్యం సమకాలీన సాంఘిక పరిస్థితులకు దర్పణం పట్టింది. ఆ మహాకవి ప్రశ్నలు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. అంపశయ్య మీదవున్న తెలుగు పద్యాన్ని పల్లె జనం గొంతెత్తి పాడుకునే విధంగా ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. పద్యానికి పరుసవేది జాషువ. తెలుగు భాష ఉన్నంతకాలం జాషువ సాహిత్యం ఉంటుంది. జాషువ సాహిత్యం చదువుకున్నంతకాలం తెలుగుభాష బట్టకడుతుంది. మా దృష్టిలో జాషువా రచనలకి ప్రజల్లో ఎంత ప్రచారం కల్పిస్తే, తెలుగు భాషకి అంత ప్రచారం దక్కుతుంది. తెలుగు భాషాభిమానులు ముందుగా జాషువ సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి.
మహాకవి 'ఫిరదౌసి' కావ్య నాటకీకరణను, ఆ పుస్తక ముద్రణకు జాషువ కళాపీఠం బాధ్యత తీసుకుంది. మనసు ఫౌండేషన్ ఎం వి రాయుడు గారితో కలిసి జాషువ సర్వలభ్య రచనల సంకలనంలో మహాకవి జాషువ కళాపీఠం భాగస్వామి అయింది. ఈ సంకలనం తెలుగు సాహిత్యంలో వందమైళ్ళరాయి. శత స్రంస్కోకిల స్థాయి రససిద్ధులైన కవీశ్వరుడికి నీరజనాల షహనాయి. జాషువా అక్షర లోక అజరామరుడు. తెలుగు కవిత్వానికి ప్రపంచ దీపం పట్టినవాడు. జ్ఞానపీఠం కన్నా, నోబులు కన్నా ఆయన ఎత్తైనవాడు. ప్రతి కవీ ఒక పువ్వై జాషువా మెడలో ఒక మాలగా మారటం నభూతో నభష్యతి. "అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజా పతి".
- ఆచార్య ఎండ్లూరి సుధాకర్
మహాకవి జాషువ సాహిత్యం సమకాలీన సాంఘిక పరిస్థితులకు దర్పణం పట్టింది. ఆ మహాకవి ప్రశ్నలు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. అంపశయ్య మీదవున్న తెలుగు పద్యాన్ని పల్లె జనం గొంతెత్తి పాడుకునే విధంగా ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. పద్యానికి పరుసవేది జాషువ. తెలుగు భాష ఉన్నంతకాలం జాషువ సాహిత్యం ఉంటుంది. జాషువ సాహిత్యం చదువుకున్నంతకాలం తెలుగుభాష బట్టకడుతుంది. మా దృష్టిలో జాషువా రచనలకి ప్రజల్లో ఎంత ప్రచారం కల్పిస్తే, తెలుగు భాషకి అంత ప్రచారం దక్కుతుంది. తెలుగు భాషాభిమానులు ముందుగా జాషువ సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మహాకవి 'ఫిరదౌసి' కావ్య నాటకీకరణను, ఆ పుస్తక ముద్రణకు జాషువ కళాపీఠం బాధ్యత తీసుకుంది. మనసు ఫౌండేషన్ ఎం వి రాయుడు గారితో కలిసి జాషువ సర్వలభ్య రచనల సంకలనంలో మహాకవి జాషువ కళాపీఠం భాగస్వామి అయింది. ఈ సంకలనం తెలుగు సాహిత్యంలో వందమైళ్ళరాయి. శత స్రంస్కోకిల స్థాయి రససిద్ధులైన కవీశ్వరుడికి నీరజనాల షహనాయి. జాషువా అక్షర లోక అజరామరుడు. తెలుగు కవిత్వానికి ప్రపంచ దీపం పట్టినవాడు. జ్ఞానపీఠం కన్నా, నోబులు కన్నా ఆయన ఎత్తైనవాడు. ప్రతి కవీ ఒక పువ్వై జాషువా మెడలో ఒక మాలగా మారటం నభూతో నభష్యతి. "అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజా పతి". - ఆచార్య ఎండ్లూరి సుధాకర్© 2017,www.logili.com All Rights Reserved.