ఒక గ్రహానికి సూక్ష్మ స్థాయిలో బలాబల నిర్ణయానికి విశేషించి వివాహము, ఉద్యోగమూ వంటి ప్రత్యేక అంశాలకు బలాన్ని నిర్ణయించే విషయంలో షోడశవర్గులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. వృత్తి విషయంలో దశమాంశ వర్గచక్రమును పరిశీలించడం తప్పనిసరి. ఆ విధముగా ఒక అంశము యొక్క బల నిర్ణయానికి షోడశవర్గులను వినియోగించుకునే పధ్ధతి భారతీయ జ్యోతిషంలో మాత్రమే మనకు గోచరిస్తుంది. ఆ అంశలకుగల సంఖ్యలతో పాటు ప్రత్యేక నామాలు ఉన్నాయి. ఆ నామాలను బట్టి ఆ అంశ ఇచ్చే ఫలితాలు చాలా ఆశ్చర్య జనకంగా రూపొందించారు.
ఆ షోడశవర్గుల ప్రాభవములు ఏ విధముగా పరిశీలించాలి? అనే అంశముపై వివరాలు ప్రాచీన జ్యోతిష శాస్త్రసాహిత్యంలో విస్తృతమైన వివరణలు కనిపించలేదు. షష్ట్యంశ మొదలగు వర్గచక్రాలలో 'నామానుసారి ఫలాని ఊహియాని' అనే వాక్యము కనిపిస్తుంది. షోడశవర్గులపై ఈ రకమైన విశ్లేషణకు ఇదే ప్రప్రథమైన గ్రంథం అనడంలో సందేహం లేదు. గ్రహబల నిరూపణకు, ఫలితాల విశ్లేషణ కొరకు ఈ గ్రంథాన్ని జ్యోతిష విద్యార్ధి వర్గం, పరిశోధక పండిత వర్గాలవారు వినియోగించుకుని ఆనందించగలరని ఆశిస్తూ...
- సి వి సుబ్రహ్మణ్యం
ఒక గ్రహానికి సూక్ష్మ స్థాయిలో బలాబల నిర్ణయానికి విశేషించి వివాహము, ఉద్యోగమూ వంటి ప్రత్యేక అంశాలకు బలాన్ని నిర్ణయించే విషయంలో షోడశవర్గులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. వృత్తి విషయంలో దశమాంశ వర్గచక్రమును పరిశీలించడం తప్పనిసరి. ఆ విధముగా ఒక అంశము యొక్క బల నిర్ణయానికి షోడశవర్గులను వినియోగించుకునే పధ్ధతి భారతీయ జ్యోతిషంలో మాత్రమే మనకు గోచరిస్తుంది. ఆ అంశలకుగల సంఖ్యలతో పాటు ప్రత్యేక నామాలు ఉన్నాయి. ఆ నామాలను బట్టి ఆ అంశ ఇచ్చే ఫలితాలు చాలా ఆశ్చర్య జనకంగా రూపొందించారు. ఆ షోడశవర్గుల ప్రాభవములు ఏ విధముగా పరిశీలించాలి? అనే అంశముపై వివరాలు ప్రాచీన జ్యోతిష శాస్త్రసాహిత్యంలో విస్తృతమైన వివరణలు కనిపించలేదు. షష్ట్యంశ మొదలగు వర్గచక్రాలలో 'నామానుసారి ఫలాని ఊహియాని' అనే వాక్యము కనిపిస్తుంది. షోడశవర్గులపై ఈ రకమైన విశ్లేషణకు ఇదే ప్రప్రథమైన గ్రంథం అనడంలో సందేహం లేదు. గ్రహబల నిరూపణకు, ఫలితాల విశ్లేషణ కొరకు ఈ గ్రంథాన్ని జ్యోతిష విద్యార్ధి వర్గం, పరిశోధక పండిత వర్గాలవారు వినియోగించుకుని ఆనందించగలరని ఆశిస్తూ... - సి వి సుబ్రహ్మణ్యం© 2017,www.logili.com All Rights Reserved.