ఆయనము అంటే నడక. కాలము ఉత్తరాయణము, దక్షిణాయనము అని రెండుగా నడుస్తుంది. రెండు పాదములు అనగా రెండుకాళ్ళు లేవనుకోండి - అపుడు మనం నడిచే నడక కుంటినడక. సక్రమంగా నడవలేము. అలాగే రామచంద్రమూర్తి రెండుకాళ్ళు బాహ్యంలో ఉండే కాళ్ళుకావు. అయన సత్యాన్ని, ధర్మాన్ని రెండిటినీ రెండు పాదములుగా పెట్టుకొని నడిచాడు. అందుకని ఏదిపోనివ్వండి అయన లక్ష్యపెట్టలేదు. ఎంతటి కష్టం రానివ్వండి అయన బెంగపెట్టుకోలేదు. సత్యము, ధర్మము - ఈ రెండిటిని మాత్రము అయన ఎన్నడూ విడిచిపెట్టలేదు. సత్యధర్మములను నమ్ముకొన్నవానిని ఆ రెండూ ఎలా కాపాడతాయో రామాయణం మనకు చూపిస్తుంది.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ సమాజ హితం కోసం రామాయణ, భారత, భాగవతాది అనేక భారతీయ సంస్కృతీ సాహిత్య అంశాలపై జనరంజకంగా ప్రవచనాలు చేస్తున్నారు. లక్షలాది మందిని సమ్మోహితులను చేస్తున్న వీరి ప్రసంగశైలి విశిష్టమైనది. వీరు తమ ట్రస్ట్ ద్వారా భారతీయ సంప్రదాయాలను ప్రచారం చేయడానికి విశేషమైన కృషి చేస్తున్నారు.
ఆయనము అంటే నడక. కాలము ఉత్తరాయణము, దక్షిణాయనము అని రెండుగా నడుస్తుంది. రెండు పాదములు అనగా రెండుకాళ్ళు లేవనుకోండి - అపుడు మనం నడిచే నడక కుంటినడక. సక్రమంగా నడవలేము. అలాగే రామచంద్రమూర్తి రెండుకాళ్ళు బాహ్యంలో ఉండే కాళ్ళుకావు. అయన సత్యాన్ని, ధర్మాన్ని రెండిటినీ రెండు పాదములుగా పెట్టుకొని నడిచాడు. అందుకని ఏదిపోనివ్వండి అయన లక్ష్యపెట్టలేదు. ఎంతటి కష్టం రానివ్వండి అయన బెంగపెట్టుకోలేదు. సత్యము, ధర్మము - ఈ రెండిటిని మాత్రము అయన ఎన్నడూ విడిచిపెట్టలేదు. సత్యధర్మములను నమ్ముకొన్నవానిని ఆ రెండూ ఎలా కాపాడతాయో రామాయణం మనకు చూపిస్తుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ సమాజ హితం కోసం రామాయణ, భారత, భాగవతాది అనేక భారతీయ సంస్కృతీ సాహిత్య అంశాలపై జనరంజకంగా ప్రవచనాలు చేస్తున్నారు. లక్షలాది మందిని సమ్మోహితులను చేస్తున్న వీరి ప్రసంగశైలి విశిష్టమైనది. వీరు తమ ట్రస్ట్ ద్వారా భారతీయ సంప్రదాయాలను ప్రచారం చేయడానికి విశేషమైన కృషి చేస్తున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.