ఉపోద్ఘాతము
కల్కిహరి తన ఎదుటనున్న విష్ణు విగ్రహాన్ని ప్రార్థిస్తూ ఉండగా ఉత్తరదిశ నుంచి వచ్చే చల్లటి గాలి తగిలింది. బలమైన ఆ గాలి వల్ల అతని ఉంగరాల జుట్టు మచ్చలున్న తన ముఖంపై పడింది.
శిలామూర్తిని విస్మయంతో చూశాడు కల్కిహరి. ఇరవై అడుగుల అద్భుతమది. విష్ణువు చతుర్భుజాలతో, శంఖ, చక్ర, గదా, పద్మధరుడై దర్శనమిచ్చాడు. ఆ ప్రశాంత ముఖము ఒక విధమైన సంకల్పముతో ఉన్నట్టుగా అనిపిస్తుంది.
ఆ ప్రతిమ ఎదుట తను మరుగుజ్జులాగా ఉన్నా, కల్కి చింతించలేదు. విష్ణువెదుట తానెప్పుడూ చిన్నవాడే. కళ్ళు మూసుకుని ప్రార్థించాడు. చలి తన లోలోపలికి చేరలేదు; ఇంకొకరికి వలె భయం పుట్టించలేదు. ఏదైనా సాధించేందుకు తనకి సహనము, ఉత్సాహము గలవు. విష్ణుశక్తి తనలో ఉంది.
"నాతో ఉండు."
అని ప్రార్ధించి కళ్ళు తెరిచాడు.
లేచి నిలబడి, పాదాల మీది నుంచి మంచుని దులిపేసుకుంటుండగా ఒక చిలుక వచ్చి గాయపడ్డ అతని భుజంపై కూర్చుంది. దాన్ని తట్టి, దాని మెడను సున్నితంగా గోకాడు. మంచు సెలయేరులోంచి 'రత్నమరు' అనబడే తన ఖడ్గాన్ని తీసి దాన్ని చేతపట్టాడు. దానిపై చెక్కబడ్డ శాసనాలను పరిశీలించాడు. విచిత్ర చిహ్నాలుగల ఆ ఖడ్గానికి ఏదో ఆకర్షణ ఉంది. ఖడ్గాన్ని ఒరలో పెట్టుకొని అశ్వాన్ని అధిరోహించాడు. దాని తల నిమురుతూ, పగ్గాలను గట్టిగా పట్టుకొని, డెక్కలను తట్టాడు. అశ్వం పేరు 'దేవదత్తుడు', కల్కిహరికి పూర్వపరిచితుడైన ఒక వ్యక్తి పేరే.
గుర్రం తన ముందటి కాళ్ళను లేపడంతో క్షణంపాటు ఉదయసూర్యుని ఆకారం మరుగునపడింది.
తాను సంసిద్ధుడయ్యాడు..........................
ఉపోద్ఘాతము కల్కిహరి తన ఎదుటనున్న విష్ణు విగ్రహాన్ని ప్రార్థిస్తూ ఉండగా ఉత్తరదిశ నుంచి వచ్చే చల్లటి గాలి తగిలింది. బలమైన ఆ గాలి వల్ల అతని ఉంగరాల జుట్టు మచ్చలున్న తన ముఖంపై పడింది. శిలామూర్తిని విస్మయంతో చూశాడు కల్కిహరి. ఇరవై అడుగుల అద్భుతమది. విష్ణువు చతుర్భుజాలతో, శంఖ, చక్ర, గదా, పద్మధరుడై దర్శనమిచ్చాడు. ఆ ప్రశాంత ముఖము ఒక విధమైన సంకల్పముతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ ప్రతిమ ఎదుట తను మరుగుజ్జులాగా ఉన్నా, కల్కి చింతించలేదు. విష్ణువెదుట తానెప్పుడూ చిన్నవాడే. కళ్ళు మూసుకుని ప్రార్థించాడు. చలి తన లోలోపలికి చేరలేదు; ఇంకొకరికి వలె భయం పుట్టించలేదు. ఏదైనా సాధించేందుకు తనకి సహనము, ఉత్సాహము గలవు. విష్ణుశక్తి తనలో ఉంది. "నాతో ఉండు." అని ప్రార్ధించి కళ్ళు తెరిచాడు. లేచి నిలబడి, పాదాల మీది నుంచి మంచుని దులిపేసుకుంటుండగా ఒక చిలుక వచ్చి గాయపడ్డ అతని భుజంపై కూర్చుంది. దాన్ని తట్టి, దాని మెడను సున్నితంగా గోకాడు. మంచు సెలయేరులోంచి 'రత్నమరు' అనబడే తన ఖడ్గాన్ని తీసి దాన్ని చేతపట్టాడు. దానిపై చెక్కబడ్డ శాసనాలను పరిశీలించాడు. విచిత్ర చిహ్నాలుగల ఆ ఖడ్గానికి ఏదో ఆకర్షణ ఉంది. ఖడ్గాన్ని ఒరలో పెట్టుకొని అశ్వాన్ని అధిరోహించాడు. దాని తల నిమురుతూ, పగ్గాలను గట్టిగా పట్టుకొని, డెక్కలను తట్టాడు. అశ్వం పేరు 'దేవదత్తుడు', కల్కిహరికి పూర్వపరిచితుడైన ఒక వ్యక్తి పేరే. గుర్రం తన ముందటి కాళ్ళను లేపడంతో క్షణంపాటు ఉదయసూర్యుని ఆకారం మరుగునపడింది. తాను సంసిద్ధుడయ్యాడు..........................© 2017,www.logili.com All Rights Reserved.