ఒక వ్యక్తికి కవిత్వశక్తి అలవడాలంటే పూర్వ పుణ్య సంస్కారం అవసరమని విజ్ఞుల భావన. అందులోనూ ఆధ్యాత్మిక సంస్కారం అలవడాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం కావాలి. తమ్మిన పరమాత్మ గారి తల్లిదండ్రులు తమ బిడ్డకు 'పరమాత్మ' అనే పేరు పెట్టడంలోనే ఒక ప్రత్యేకతను ప్రదర్శించారు. తమ బిడ్డ ఆధ్యాత్మిక సంస్కార సంపద కావాలనే ఆలోచన, కోరిక ఆ తల్లిదండ్రులకు ఉండవచ్చు. అయితే లోకంలో ఎంతో మంది తల్లితండ్రులు పెట్టిన పేర్ల అర్థంకంటే భిన్నంగా ప్రవర్తించేవారున్నారు. కానీ 'పరమాత్మ' గారు గృహ సంబంధిత కార్యక్రమాల్ని సక్రమంగా నిర్వర్తిస్తూనే పేరును సార్థకం చేసుకుంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటమే కాకుండా ఆధ్యాత్మిక సాహిత్యాన్ని కూడా లోకానికి అందించటం అభినందనీయం.
వీరు ఇంతకుముందు ఎన్నో రచనల్ని భక్తలోకానికి అందించారు. ఇప్పుడు 'శ్రీ విష్ణు సహస్ర వైభవం' పేరుతో మరో గ్రంథాన్ని వెలువరిస్తున్నాయి. సహస్ర నామాలని చక్కగా అర్థం చేసుకొని, ఆ నామవైశిష్ట్యాల్ని తాను చెప్పదలచుకొన్న రగడలో చెప్పి పరమాత్మ గారు తమకు గల రచనా వైదుష్యాన్ని ప్రదర్శించారు.
ఒక వ్యక్తికి కవిత్వశక్తి అలవడాలంటే పూర్వ పుణ్య సంస్కారం అవసరమని విజ్ఞుల భావన. అందులోనూ ఆధ్యాత్మిక సంస్కారం అలవడాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం కావాలి. తమ్మిన పరమాత్మ గారి తల్లిదండ్రులు తమ బిడ్డకు 'పరమాత్మ' అనే పేరు పెట్టడంలోనే ఒక ప్రత్యేకతను ప్రదర్శించారు. తమ బిడ్డ ఆధ్యాత్మిక సంస్కార సంపద కావాలనే ఆలోచన, కోరిక ఆ తల్లిదండ్రులకు ఉండవచ్చు. అయితే లోకంలో ఎంతో మంది తల్లితండ్రులు పెట్టిన పేర్ల అర్థంకంటే భిన్నంగా ప్రవర్తించేవారున్నారు. కానీ 'పరమాత్మ' గారు గృహ సంబంధిత కార్యక్రమాల్ని సక్రమంగా నిర్వర్తిస్తూనే పేరును సార్థకం చేసుకుంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటమే కాకుండా ఆధ్యాత్మిక సాహిత్యాన్ని కూడా లోకానికి అందించటం అభినందనీయం. వీరు ఇంతకుముందు ఎన్నో రచనల్ని భక్తలోకానికి అందించారు. ఇప్పుడు 'శ్రీ విష్ణు సహస్ర వైభవం' పేరుతో మరో గ్రంథాన్ని వెలువరిస్తున్నాయి. సహస్ర నామాలని చక్కగా అర్థం చేసుకొని, ఆ నామవైశిష్ట్యాల్ని తాను చెప్పదలచుకొన్న రగడలో చెప్పి పరమాత్మ గారు తమకు గల రచనా వైదుష్యాన్ని ప్రదర్శించారు.© 2017,www.logili.com All Rights Reserved.