గోవిలాపము
సీ॥ స్మరియింపరో “అహింసా పరమో ధర్మ”
మనెడు నార్యోక్తి పుణ్యాత్ములార!
భావింపరో “ఆత్మవత్సర్వ భూతాని"
యన్న ధర్మోక్తి ధన్యాత్ములార!
తరచరో “పాపాయ పరపీడన" మటన్న
సత్యార్ధమును దయాశాలులార!
అనరో “పరోపకారార్థం శరీర”మన్
దివ్యసూక్తిని బుధధ్యేయులార!
తే||జీవుల నకారణముగ హింసింతు రేల?
తోడిజీవుల మీవలె జూడరేల?
జంతుసంతతిబట్టి బాధింతు రేల?
దేహములఁ బెంప మమ్ము వధింతు రేల?
1
తాత్పర్యం :- “ఓ పుణ్యాత్ములారా! అహింసయే పరమధర్మమనే పెద్దలమాట మీరు స్మరించారా? (దయతో స్మరించండి) ఓ ధన్యాత్ములారా! 'అన్నిప్రాణులూ తమవంటివే' అనే ధర్మవాక్కును భావించలేరా? (భావించండి) ఓ దయాశాలులారా! 'పరపీడనం పాపానికి కారణమవుతుంద'నే సత్యార్థాన్ని మీరు తలంచరా? (భావించండి) జ్ఞానాన్నే లక్ష్యంగా దైవాన్నే లక్ష్యంగా) కల్గిన మహాత్ములారా! “ఇతరులకు ఉపయోగపడేందుకే ఈ శరీరాన్ని భగవంతుడిచ్చాడనే దివ్యసూక్తిని అనరెందుకు? (దయతో అనండయ్యా!) జీవుల్ని నిష్కారణంగా ఎందుకు చంపుతాయా? తోడిజీవుల్ని మీవలే ఎందుకు చూడరు? జంతువులను ఎందుకు..........
గోవిలాపము సీ॥ స్మరియింపరో “అహింసా పరమో ధర్మ” మనెడు నార్యోక్తి పుణ్యాత్ములార!భావింపరో “ఆత్మవత్సర్వ భూతాని" యన్న ధర్మోక్తి ధన్యాత్ములార!తరచరో “పాపాయ పరపీడన" మటన్న సత్యార్ధమును దయాశాలులార! అనరో “పరోపకారార్థం శరీర”మన్ దివ్యసూక్తిని బుధధ్యేయులార! తే||జీవుల నకారణముగ హింసింతు రేల? తోడిజీవుల మీవలె జూడరేల? జంతుసంతతిబట్టి బాధింతు రేల? దేహములఁ బెంప మమ్ము వధింతు రేల? 1 తాత్పర్యం :- “ఓ పుణ్యాత్ములారా! అహింసయే పరమధర్మమనే పెద్దలమాట మీరు స్మరించారా? (దయతో స్మరించండి) ఓ ధన్యాత్ములారా! 'అన్నిప్రాణులూ తమవంటివే' అనే ధర్మవాక్కును భావించలేరా? (భావించండి) ఓ దయాశాలులారా! 'పరపీడనం పాపానికి కారణమవుతుంద'నే సత్యార్థాన్ని మీరు తలంచరా? (భావించండి) జ్ఞానాన్నే లక్ష్యంగా దైవాన్నే లక్ష్యంగా) కల్గిన మహాత్ములారా! “ఇతరులకు ఉపయోగపడేందుకే ఈ శరీరాన్ని భగవంతుడిచ్చాడనే దివ్యసూక్తిని అనరెందుకు? (దయతో అనండయ్యా!) జీవుల్ని నిష్కారణంగా ఎందుకు చంపుతాయా? తోడిజీవుల్ని మీవలే ఎందుకు చూడరు? జంతువులను ఎందుకు..........© 2017,www.logili.com All Rights Reserved.