శ్రీపాదులు దత్తదాసుని ఇంట భక్తులకు తెలిపిన అభయ వాక్యాలు
1. నా చరిత్ర పారాయణ జరిగే చోట నేను సూక్ష్మ రూపంలో ఉంటాను.
2. మనో, వాక్కాయ, కర్మల నాకు అంకితమైన వారిని కంటికి రెప్పలా చూసుకుంటాను.
3. శ్రీపీఠికాపురంలో ప్రతిదినము మధ్యాన్నం భిక్ష స్వీకరిస్తాను.
4. సదా నన్ను ధ్యానించేవారి కర్మల నన్నింటిని, జన్మ జన్మాంత రాలవైనా సరే, భస్మం చేస్తాను.
5. ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టినట్లయితే నేను ప్రసన్నుడను అవుతాను.
6. నా భక్తుల ఇంట మహాలక్ష్మి తన సంపూర్ణ కళలతో ప్రకాశించును.
7. నీ అంతఃకరణం పవిత్రంగా ఉన్నట్లయితే నా అనుగ్రహం నీపైన ఉంటుంది.
8. నీవు ఏ దేవతను ఆరాధించినా, ఏ గురువును ఆశ్రయించినా నాకు సమ్మతమే.
9. నీవు చేసే ప్రార్ధనలన్ని నన్నే చేరుతాయి. నా అనుగ్రహం నీ దేవతల ద్వారా, నీ గురువుల ద్వారా నీకు చేరుతుంది.
10. నా శ్రీపాద తత్వమును, విరాట్ స్వరూపమును అనుష్టానం ద్వారానే తెలుసుకొనగలవు.
11. నాది యోగ సంపూర్ణ అవతారం. మహాయోగులు, సిద్ధులు నా అంశావతారాలే.
12. నీవు నన్ను ఆశ్రయించినట్లయితే ధర్మ, కర్మ మార్గాలపై నడిచేలా చూస్తూ, ధర్మ భ్రష్టుడవు, కర్మ భష్టుడవు కాకుండా కాపాడుతాను.
© 2017,www.logili.com All Rights Reserved.