శ్రీవివేక చూడామణి
ఓం నమో గురుదేవాయ
శ్లో॥ సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరమ్ |
గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహమ్ ॥
ప్రతిః ఆహం: నేను, అగోచరం = ఇంద్రియాదులకు (పామరులకు) గోచరుడుకాని, సర్వ వేదాంత = సమస్తములయిన వేదాంతముల యొక్క, సిద్ధాంత సిద్దాంతములకు, గోచరం = తెలియునట్టి, పరమానందం స్వరూపుడగు, సద్గురుం = సద్గురువైన, గోవిందం: గోవింద భగవత్పాదాచార్యుల వారిని, ప్రణతః = నమస్కరించిన వాడనుగా, అస్మి = అగుచున్నాను.
"సర్వవేదాంత సిద్దాంతగోచరుడు, ఇంద్రియాలకు, మనస్సుకు అందనివాడు, పరమానంద స్వరూపుడు అయిన సద్గురువునకు, గోవిందునకు నమస్కరిస్తున్నాను.”
శ్రీ శంకరాచార్యులు శ్రీ గోవిందపాదుని శిష్యులని అందరికి తెలిసిన విషయమే. మాండూక్య కారికలను వ్రాసిన శ్రీ గౌడపాదుని శిష్యులే శ్రీగోవింద పాదులు, ఈ మొదటి శ్లోకంలో శంకరులు తమ గురుదేవునికి నమస్సులర్పిస్తున్నారు.
ఈ శ్లోకానికి రెండు విధాలుగా అర్థంచెప్పవచ్చును. ఒక వ్యక్తిగా మహా మనీషి అయిన తన గురువుకు ప్రణామాలర్పించడం ఇప్పుడే చూసాం. పరిపూర్ణుడైన జ్ఞాని అనంతసత్యమైన స్వరూపానికి నమస్సులర్పిస్తూ మానవాళికి మార్గం చూపిస్తున్నాడని కూడా చెప్పవచ్చును. ఈ విధంగా అర్థం చెప్పు కున్నప్పుడు "అహం" అన్న పదాన్ని మనశ్శరీరాల కతీతంగా, ఆధారంగా ఉన్న ఆత్మగా భావించాలి. మనశరీరాల ద్వారా బాహ్యంగా చూస్తూ ఆహంకారంగా గుర్తింపబడే అహమే (ఆత్మ), పరిమితుల నుండి బయటపడి అపరిమిత సత్యాన్ని చేరుకోవాలని కోరుకుంటుంది. ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికీ అతీతంగా ఉంటూ, వేదాంత వాఙ్మయ మంతటా పరమాత్మగా గోవిందునిగా కీర్తింపబడుతూ ఉండే పరమసత్యమే తన సహజస్వరూపమని, శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా ఈ అహమే గుర్తిస్తుంది. అహం సర్వభూతాత్మగా, అద్వయంగా కేవలంగా ఉన్నానని తెలుసుకుంటుంది. ఇదే ఆనందమయమయిన స్వస్థితి. పరమపురుషార్థం, మానవ జీవిత పరమార్థం.....................
శ్రీవివేక చూడామణి ఓం నమో గురుదేవాయ శ్లో॥ సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరమ్ | గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహమ్ ॥ ప్రతిః ఆహం: నేను, అగోచరం = ఇంద్రియాదులకు (పామరులకు) గోచరుడుకాని, సర్వ వేదాంత = సమస్తములయిన వేదాంతముల యొక్క, సిద్ధాంత సిద్దాంతములకు, గోచరం = తెలియునట్టి, పరమానందం స్వరూపుడగు, సద్గురుం = సద్గురువైన, గోవిందం: గోవింద భగవత్పాదాచార్యుల వారిని, ప్రణతః = నమస్కరించిన వాడనుగా, అస్మి = అగుచున్నాను. "సర్వవేదాంత సిద్దాంతగోచరుడు, ఇంద్రియాలకు, మనస్సుకు అందనివాడు, పరమానంద స్వరూపుడు అయిన సద్గురువునకు, గోవిందునకు నమస్కరిస్తున్నాను.” శ్రీ శంకరాచార్యులు శ్రీ గోవిందపాదుని శిష్యులని అందరికి తెలిసిన విషయమే. మాండూక్య కారికలను వ్రాసిన శ్రీ గౌడపాదుని శిష్యులే శ్రీగోవింద పాదులు, ఈ మొదటి శ్లోకంలో శంకరులు తమ గురుదేవునికి నమస్సులర్పిస్తున్నారు. ఈ శ్లోకానికి రెండు విధాలుగా అర్థంచెప్పవచ్చును. ఒక వ్యక్తిగా మహా మనీషి అయిన తన గురువుకు ప్రణామాలర్పించడం ఇప్పుడే చూసాం. పరిపూర్ణుడైన జ్ఞాని అనంతసత్యమైన స్వరూపానికి నమస్సులర్పిస్తూ మానవాళికి మార్గం చూపిస్తున్నాడని కూడా చెప్పవచ్చును. ఈ విధంగా అర్థం చెప్పు కున్నప్పుడు "అహం" అన్న పదాన్ని మనశ్శరీరాల కతీతంగా, ఆధారంగా ఉన్న ఆత్మగా భావించాలి. మనశరీరాల ద్వారా బాహ్యంగా చూస్తూ ఆహంకారంగా గుర్తింపబడే అహమే (ఆత్మ), పరిమితుల నుండి బయటపడి అపరిమిత సత్యాన్ని చేరుకోవాలని కోరుకుంటుంది. ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికీ అతీతంగా ఉంటూ, వేదాంత వాఙ్మయ మంతటా పరమాత్మగా గోవిందునిగా కీర్తింపబడుతూ ఉండే పరమసత్యమే తన సహజస్వరూపమని, శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా ఈ అహమే గుర్తిస్తుంది. అహం సర్వభూతాత్మగా, అద్వయంగా కేవలంగా ఉన్నానని తెలుసుకుంటుంది. ఇదే ఆనందమయమయిన స్వస్థితి. పరమపురుషార్థం, మానవ జీవిత పరమార్థం.....................© 2017,www.logili.com All Rights Reserved.