హోమము చేయటము ఖర్చుతో కూడిన పని. కానీ ఫలితం 1000 రెట్లు ఉంటుంది. అందుకనే సాధకులు హోమం చేయటానికి ఇష్టపడతారు. ఇవాల్టి రోజున హోమము చేయించడానికి అయ్యవారికి ఇచ్చే దక్షిణ కుడా బాగా పెరిగిపోయింది. ఈ కారణం చేతనే హోమము చేయాలనుకునే వారందరూ ఎవరికి వారు స్వంతంగా హోమం చేసుకోవాలి అనే ఉద్దేశ్యంతో ఈ పుస్తకం వ్రాస్తున్నాను. ఈ పుస్తకం చూసి చిన్నపిల్లవాడు కుడా హోమం చెయ్యగలగాలి. ఇదే నా సంకల్పము.
'హోమము' అంటే దేవత పేరు చెప్పి, అగ్నిలో ఆహుతులను సమర్పించటము. ఆవునేతితో పాటుగా, ఆవుపిడకలు, దేవతకు ఇష్టమైన పదార్థాలను ఆహుతులుగా సమర్పించటం జరుగుతుంది. భౌతిక పదార్థంలో ఇమిడి ఉన్న సూక్ష్మమైన శక్తిని, అగ్నిద్వారా వచ్చే ఉష్ణశక్తిని, మంత్రోచ్ఛారణ ద్వారా వచ్చే శబ్దతరంగ శక్తిని ఒకేసారి ఉపయోగించేందుకు చేయబడే విధి విధానంతో కూడిన ప్రక్రియనే హోమము అన్నారు. హోమకుండంలో ఆవుపిడకలు వేసి, వాటిని ఆవునేతితో మండించినప్పుడు వచ్చే శక్తి విషయవాయువులు, కేన్సరు మొదలైన వాటిని నిరోధిస్తుంది. భోపాల్లో గ్యాసు లీకయినప్పుడు అక్కడ చాలామంది మరణించారు. కాని నిరంతరము హోమం చేస్తున్న ఒక బ్రాహ్మణ కుటుంబం మాత్రం సురక్షితంగా బ్రతికి బయటపడింది. హోమం చెయ్యటంవల్ల భౌతికమైన ప్రయోజనం చాలా ఉంది. చుట్టుప్రక్కల వాతావరణం స్వచ్ఛంగా మారుతుంది. గాలిలో ప్రాణవాయువు శాతంకుడా పెరుగుతుంది. హోమకుండంలో సుగంధ ద్రవ్యాలను మండించినట్లైతే, పరిసర ప్రాంతాల వాతావరణం ఆరోగ్యకరంగా ఉంటుంది. అణుధార్మికశక్తి నశిస్తుంది. జపం కన్నా హోమం వెయ్యి రెట్లు ఉత్తమం. కానీ ఖర్చుతో కూడిన పని.
హోమం చెయ్యటానికి ఆవుపిడకలు, ఆవునెయ్యి కావాలి. ఇవి దేశవాళీ ఆవు నుంచే సేకరించాలి. సంకరజాతి ఆవులవి పనికిరావు. వాటివల్ల మంచి ఫలితం రాదు. అయితే ఇవాల్టి రోజున దేశవాళీ ఆవులు తగ్గిపోయినాయి. దేశవాళీ ఆవు అంటే దానికి గంగడోలు (మెడ క్రింద వ్రేలాడే చర్మము) వీపున మూపురము.......................
హోమ విధానము హోమము చేయటము ఖర్చుతో కూడిన పని. కానీ ఫలితం 1000 రెట్లు ఉంటుంది. అందుకనే సాధకులు హోమం చేయటానికి ఇష్టపడతారు. ఇవాల్టి రోజున హోమము చేయించడానికి అయ్యవారికి ఇచ్చే దక్షిణ కుడా బాగా పెరిగిపోయింది. ఈ కారణం చేతనే హోమము చేయాలనుకునే వారందరూ ఎవరికి వారు స్వంతంగా హోమం చేసుకోవాలి అనే ఉద్దేశ్యంతో ఈ పుస్తకం వ్రాస్తున్నాను. ఈ పుస్తకం చూసి చిన్నపిల్లవాడు కుడా హోమం చెయ్యగలగాలి. ఇదే నా సంకల్పము. 'హోమము' అంటే దేవత పేరు చెప్పి, అగ్నిలో ఆహుతులను సమర్పించటము. ఆవునేతితో పాటుగా, ఆవుపిడకలు, దేవతకు ఇష్టమైన పదార్థాలను ఆహుతులుగా సమర్పించటం జరుగుతుంది. భౌతిక పదార్థంలో ఇమిడి ఉన్న సూక్ష్మమైన శక్తిని, అగ్నిద్వారా వచ్చే ఉష్ణశక్తిని, మంత్రోచ్ఛారణ ద్వారా వచ్చే శబ్దతరంగ శక్తిని ఒకేసారి ఉపయోగించేందుకు చేయబడే విధి విధానంతో కూడిన ప్రక్రియనే హోమము అన్నారు. హోమకుండంలో ఆవుపిడకలు వేసి, వాటిని ఆవునేతితో మండించినప్పుడు వచ్చే శక్తి విషయవాయువులు, కేన్సరు మొదలైన వాటిని నిరోధిస్తుంది. భోపాల్లో గ్యాసు లీకయినప్పుడు అక్కడ చాలామంది మరణించారు. కాని నిరంతరము హోమం చేస్తున్న ఒక బ్రాహ్మణ కుటుంబం మాత్రం సురక్షితంగా బ్రతికి బయటపడింది. హోమం చెయ్యటంవల్ల భౌతికమైన ప్రయోజనం చాలా ఉంది. చుట్టుప్రక్కల వాతావరణం స్వచ్ఛంగా మారుతుంది. గాలిలో ప్రాణవాయువు శాతంకుడా పెరుగుతుంది. హోమకుండంలో సుగంధ ద్రవ్యాలను మండించినట్లైతే, పరిసర ప్రాంతాల వాతావరణం ఆరోగ్యకరంగా ఉంటుంది. అణుధార్మికశక్తి నశిస్తుంది. జపం కన్నా హోమం వెయ్యి రెట్లు ఉత్తమం. కానీ ఖర్చుతో కూడిన పని. హోమం చెయ్యటానికి ఆవుపిడకలు, ఆవునెయ్యి కావాలి. ఇవి దేశవాళీ ఆవు నుంచే సేకరించాలి. సంకరజాతి ఆవులవి పనికిరావు. వాటివల్ల మంచి ఫలితం రాదు. అయితే ఇవాల్టి రోజున దేశవాళీ ఆవులు తగ్గిపోయినాయి. దేశవాళీ ఆవు అంటే దానికి గంగడోలు (మెడ క్రింద వ్రేలాడే చర్మము) వీపున మూపురము.......................© 2017,www.logili.com All Rights Reserved.