పరబ్రహ్మ దేవతలైన పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీ నారాయణులు- ఆంజనేయస్వామి రచయితనైన ఈ దాసాను దాసునకు అనుగ్రహించిన అనుగ్రహాల వివరాలు
స్వప్నంలో 1985లో దత్తాత్రేయ స్వామిదర్శనం (నేను ఉపాసించని దైవము) స్వప్నంలో 1985లో శివకేశవ భేదము పెట్టుకోవద్దని పరమాత్మ సూచించుట. ధ్యానంలో మొట్టమొదటిగా భోగిరోజున ధ్యానంలో శ్రీరామ దర్శనము కలిగింది. ధ్యానంలో రెండవసారి బాలాంజనేయుడు ధ్యాన.................
పరబ్రహ్మ దేవతలైన పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీ నారాయణులు- ఆంజనేయస్వామి రచయితనైన ఈ దాసాను దాసునకు అనుగ్రహించిన అనుగ్రహాల వివరాలు దేవతలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మరియు నిజదర్శనంగానైనా లేక మానుషరూపంలో కన్పిస్తూ నాకున్న సర్వదోషాలను, రుగ్మతలను క్రమేణా 36 సంవత్సరాల కాలంలో తగ్గించి వేశారు. నేను ఉపాసించిన ప్రతిమంత్రము నాకు పరిపూర్ణంగ సిద్ధిపజేశారు. మంత్రసిద్ధిని, కాయసిద్ధిని, బుద్ధి జ్ఞాన సిద్ధిని వికాశాన్ని కలుగజేశారు. నవగ్రహ దేవతలు (రవి - చంద్రులు తప్ప) స్పష్టంగ ధ్యానంలో దర్శన మిచ్చేవారు. స్వప్న దర్శనంతో బాటు అప్పుడప్పుడూ సంభాషించేవారు. స్వప్నంలో నవగ్రహాలు (కేతువు ఒక్కడే) మరియు నృసింహస్వామి నాకు ఖండయోగ విద్యను నాచే ప్రదర్శింపచేసేవారు. అలాగే కేతుగ్రహము ఖండయోగాన్ని నా యెదుట స్వప్నంలో ప్రదర్శించేవారు. దుష్టగ్రహ బాధనాతో సహా అందరకు ఉంటుంది. వీటి శక్తిని దునుమాడి వాటిని అణచివేసే శక్తిని దేవతలు నాకు ప్రసాదించారు. అలాగే ఈ దుష్టగ్రహాలు సర్పరూపంలో దివ్య స్వప్నంలో, నాతో స్పష్టంగా మాట్లాడేవి. సర్ప రూపంలోనే నన్ను బాధిస్తూ నాకు ప్రస్తుతం ఉన్న చెడు స్థితిని తెలియజేసేవారు. అయితే కుజ, రాహు, కేతు సర్పగ్రహాల తేడాను స్పష్టంగా తెల్సుకునే జ్ఞానాన్ని నాకు నా గురుదేవుళ్ళు, భగవంతుడు ప్రసాదించారు. నా సాధన తొలి ప్రయత్నంలోనే దత్తభగవానుని దర్శనం: స్వప్నంలో 1985లో దత్తాత్రేయ స్వామిదర్శనం (నేను ఉపాసించని దైవము) స్వప్నంలో 1985లో శివకేశవ భేదము పెట్టుకోవద్దని పరమాత్మ సూచించుట. ధ్యానంలో మొట్టమొదటిగా భోగిరోజున ధ్యానంలో శ్రీరామ దర్శనము కలిగింది. ధ్యానంలో రెండవసారి బాలాంజనేయుడు ధ్యాన.................© 2017,www.logili.com All Rights Reserved.