శ్రీమాత్రే నమః
శ్రీమాతా, శ్రీమహారాజ్జీ, శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యతా
ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా
రాగస్వరూప పాశాఢ్యాక్రోధాకారాంకుశోజ్జ్వలా
శ్రీ లలితాసహస్ర నామ స్తోత్ర లఘు వ్యాఖ్య శ్రీదేవి కరుణాకటాక్షాలతో వివరించటానికి ప్రయత్నిస్తున్నాను.
సాధకులు సహృదయంతో స్వీకరించమని ప్రార్థన.
1. శ్రీమాతా, శ్రీమహారాజీ, శ్రీమత్సింహాసనేశ్వరీ
లోకంలో సుఖదుఃఖాలలో మొదటగా స్ఫురణకొచ్చేదీ, స్మరింపపడేది తల్లి. పరమ దయారూపిణి కాబట్టి 'మాతా' అని ప్రారంభిస్తూ పరమపూజ్యురాలు కాబట్టి 'శ్రీ' చేర్చబడింది. 'శ్రీ' కి అనేక వేదాంతార్థాలున్నా, గౌరవ సూచకంగా ఆత్మీయభావంతో, మాతృస్వరూపంగా తీసుకొని 'శ్రీమాతా' అన్న సామాన్యార్ధమే తీసుకోవాలి. సర్వ 'శ్రీ' లకు నిలయమైనది తల్లి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇవ్వలేని పరోక్ష 'శ్రీ'లు ముక్తిప్రదాలు. విద్య, వివేకం, జ్ఞానం, ఆధ్యాత్మికత, భక్తి, ధ్యాన నిధిధ్యాసలు, కైవల్యం, జన్మ సాఫల్య 'శ్రీ'లనిచ్చే కరుణామూర్తి. శ్రీ విద్యకి మూలభూతం, బిందురూపిణి.
సర్వజగత్తును సృష్టించి పాలించి పోషిస్తున్న మహాశక్తి శ్రీమాత. బ్రహ్మ, విష్ణు, రుద్రాదులచే ఆరాధింపబడి తనదైన శక్తిని వారికి పంచి సృష్టి నడిపిస్తున్న జగన్మాత 'శ్రీమాత'. ఆవిడ మహారాజ్ఞి. మహాదేవుని రాజ్జి. శివశక్తి స్వరూపిణిగా అపారకరుణ, ప్రేమలతో తనదైన అఖండ 'స్థితి' నైపుణ్యంతో సర్వప్రాణికోటినీ పాలించే మహారాణి,................
శ్రీమాత్రే నమః శ్రీమాతా, శ్రీమహారాజ్జీ, శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యతా ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా రాగస్వరూప పాశాఢ్యాక్రోధాకారాంకుశోజ్జ్వలా శ్రీ లలితాసహస్ర నామ స్తోత్ర లఘు వ్యాఖ్య శ్రీదేవి కరుణాకటాక్షాలతో వివరించటానికి ప్రయత్నిస్తున్నాను. సాధకులు సహృదయంతో స్వీకరించమని ప్రార్థన.1. శ్రీమాతా, శ్రీమహారాజీ, శ్రీమత్సింహాసనేశ్వరీ లోకంలో సుఖదుఃఖాలలో మొదటగా స్ఫురణకొచ్చేదీ, స్మరింపపడేది తల్లి. పరమ దయారూపిణి కాబట్టి 'మాతా' అని ప్రారంభిస్తూ పరమపూజ్యురాలు కాబట్టి 'శ్రీ' చేర్చబడింది. 'శ్రీ' కి అనేక వేదాంతార్థాలున్నా, గౌరవ సూచకంగా ఆత్మీయభావంతో, మాతృస్వరూపంగా తీసుకొని 'శ్రీమాతా' అన్న సామాన్యార్ధమే తీసుకోవాలి. సర్వ 'శ్రీ' లకు నిలయమైనది తల్లి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇవ్వలేని పరోక్ష 'శ్రీ'లు ముక్తిప్రదాలు. విద్య, వివేకం, జ్ఞానం, ఆధ్యాత్మికత, భక్తి, ధ్యాన నిధిధ్యాసలు, కైవల్యం, జన్మ సాఫల్య 'శ్రీ'లనిచ్చే కరుణామూర్తి. శ్రీ విద్యకి మూలభూతం, బిందురూపిణి. సర్వజగత్తును సృష్టించి పాలించి పోషిస్తున్న మహాశక్తి శ్రీమాత. బ్రహ్మ, విష్ణు, రుద్రాదులచే ఆరాధింపబడి తనదైన శక్తిని వారికి పంచి సృష్టి నడిపిస్తున్న జగన్మాత 'శ్రీమాత'. ఆవిడ మహారాజ్ఞి. మహాదేవుని రాజ్జి. శివశక్తి స్వరూపిణిగా అపారకరుణ, ప్రేమలతో తనదైన అఖండ 'స్థితి' నైపుణ్యంతో సర్వప్రాణికోటినీ పాలించే మహారాణి,................© 2017,www.logili.com All Rights Reserved.