నైమిషారణ్య వాసులగు మహర్షులతో సూతుని సంవాదము
దేవతలు శంకరుని స్తుతించుట
ఐశ్వరం పరమం తత్త్వమాదిమధ్యాంతవర్జితమ్ |
ఆధారం సర్వలోకానామనాధారమవిక్రియమ్ ||
ఈశ్వరుని స్వరూపము సకలములగు ఉపాధులకు అతీతమైనది. స్వరూపము మూడు కాలములయందు బాధించబడేది కాదు. దానికి ఆరంభము గాని, అంతము గాని, మధ్య గాని లేవు. అనగా, కాలము కల్పించే హద్దులు దానికి వర్తించవు. సకలలోకములకు అట్టి అఖండపద్రూపమగు పరబ్రహ్మయే ఆధారమై యున్నది. కాని, ఆ పరబ్రహ్మ స్వయముగా మరియొకదానిపై ఆధార పడుట లేదు. ఆ పరమతత్త్వమునందు వికారములు (మార్పులు) ఏమియు లేవు.
ఈశ్వరచైతన్యము దేశకాలములకు లోబడియుండే భౌతికపదార్థము నందు ప్రకటమైనప్పుడు, ఆ భౌతికపదార్థము యొక్క గుణములు చైతన్యము నందు సంక్రమించవు. ఆ విధముగా తన గుణములను ఆపాదించకుండగా తనలో చైతన్య ప్రకాశమును ప్రకటింపజేసే భౌతికపదార్థమునకు ఉపాధి అని పేరు. నామరూపముల ఆరోపము లేని సత్యవస్తువునకు తత్త్వము అని పేరు..........
శ్రీ గణేశాయ నమః సూత సంహితా సారః తత్త్వ ప్రకాశికా సంయుతః అథ ప్రథమోధ్యాయః నైమిషారణ్య వాసులగు మహర్షులతో సూతుని సంవాదముదేవతలు శంకరుని స్తుతించుట ఐశ్వరం పరమం తత్త్వమాదిమధ్యాంతవర్జితమ్ | ఆధారం సర్వలోకానామనాధారమవిక్రియమ్ || ఈశ్వరుని స్వరూపము సకలములగు ఉపాధులకు అతీతమైనది. స్వరూపము మూడు కాలములయందు బాధించబడేది కాదు. దానికి ఆరంభము గాని, అంతము గాని, మధ్య గాని లేవు. అనగా, కాలము కల్పించే హద్దులు దానికి వర్తించవు. సకలలోకములకు అట్టి అఖండపద్రూపమగు పరబ్రహ్మయే ఆధారమై యున్నది. కాని, ఆ పరబ్రహ్మ స్వయముగా మరియొకదానిపై ఆధార పడుట లేదు. ఆ పరమతత్త్వమునందు వికారములు (మార్పులు) ఏమియు లేవు. ఈశ్వరచైతన్యము దేశకాలములకు లోబడియుండే భౌతికపదార్థము నందు ప్రకటమైనప్పుడు, ఆ భౌతికపదార్థము యొక్క గుణములు చైతన్యము నందు సంక్రమించవు. ఆ విధముగా తన గుణములను ఆపాదించకుండగా తనలో చైతన్య ప్రకాశమును ప్రకటింపజేసే భౌతికపదార్థమునకు ఉపాధి అని పేరు. నామరూపముల ఆరోపము లేని సత్యవస్తువునకు తత్త్వము అని పేరు..........© 2017,www.logili.com All Rights Reserved.