"హిమాలయ మహాత్ముల వేదం విజ్ఞాన సంహిత" వైదిక సాహిత్య వాజ్మయంలో ఓ వినూత్న ప్రక్రియ. వేదం ఓ దివ్య నాదం. దీనిలో విశ్వరహస్యాలన్నీ ఇమిడి ఉన్నాయి. విరాట్ పురుషుని విశ్వరూపం, వేదం వాజ్మయంలో అంతర్లీనముగా ఉంది. వైదిక వాజ్మయాన్ని భారతీయ సమాజానికి, పరిచయం చేసే ప్రయత్నం ఎన్నో పీఠాలు, మఠాలు, ఆశ్రమాలు, అనుసంధాన సంస్థలు, ఎందరో మహాత్ములు చేపట్టారు. అర్హతలేని వారికి వేదంజ్ఞానాన్నందిస్తే, అపహాస్యం పాలవుతుందన్న విజ్ఞతతో వారు, మర్యాదతో కూడిన ఉన్నత విలువలను, భాషా విధానాలను అనుసరిస్తూ, తమవంతు కృషిని బాధ్యతగా నిర్వహిస్తున్నారు.
అయితే అది, జిజ్ఞాసువులైన సామాన్యులకు, అందని ద్రాక్షలానే ఉన్నాయి. సద్గురువులైన స్వామీజీలు, పీఠాధిపతులు వేదాంతర్గతంగా ఉన్న, యజ్ఞ యాగాదులను వెలికితీసి, వాటిని నిర్వర్తించడం ద్వారా, విశ్వకళ్యాణం జరిగేలా చేస్తున్నారు. పీఠాలు, ఆశ్రమాల్లో వారి నియమానుసారంగా వేదం వినియోగం ఉంటుంది. సమగ్ర వేదం విజ్ఞానం సాధారణ ఆస్తికులకు అందే అవకాశం లేదు జిజ్ఞాసువులకు వారి భాషలోనే విషయాన్ని అందించాలన్న ప్రయత్నమే ఈ గ్రంథరచన.
"హిమాలయ మహాత్ముల వేదం విజ్ఞాన సంహిత" వైదిక సాహిత్య వాజ్మయంలో ఓ వినూత్న ప్రక్రియ. వేదం ఓ దివ్య నాదం. దీనిలో విశ్వరహస్యాలన్నీ ఇమిడి ఉన్నాయి. విరాట్ పురుషుని విశ్వరూపం, వేదం వాజ్మయంలో అంతర్లీనముగా ఉంది. వైదిక వాజ్మయాన్ని భారతీయ సమాజానికి, పరిచయం చేసే ప్రయత్నం ఎన్నో పీఠాలు, మఠాలు, ఆశ్రమాలు, అనుసంధాన సంస్థలు, ఎందరో మహాత్ములు చేపట్టారు. అర్హతలేని వారికి వేదంజ్ఞానాన్నందిస్తే, అపహాస్యం పాలవుతుందన్న విజ్ఞతతో వారు, మర్యాదతో కూడిన ఉన్నత విలువలను, భాషా విధానాలను అనుసరిస్తూ, తమవంతు కృషిని బాధ్యతగా నిర్వహిస్తున్నారు. అయితే అది, జిజ్ఞాసువులైన సామాన్యులకు, అందని ద్రాక్షలానే ఉన్నాయి. సద్గురువులైన స్వామీజీలు, పీఠాధిపతులు వేదాంతర్గతంగా ఉన్న, యజ్ఞ యాగాదులను వెలికితీసి, వాటిని నిర్వర్తించడం ద్వారా, విశ్వకళ్యాణం జరిగేలా చేస్తున్నారు. పీఠాలు, ఆశ్రమాల్లో వారి నియమానుసారంగా వేదం వినియోగం ఉంటుంది. సమగ్ర వేదం విజ్ఞానం సాధారణ ఆస్తికులకు అందే అవకాశం లేదు జిజ్ఞాసువులకు వారి భాషలోనే విషయాన్ని అందించాలన్న ప్రయత్నమే ఈ గ్రంథరచన.© 2017,www.logili.com All Rights Reserved.