భారతదేశములో జరుగు నేరములకు, ఆ నేరములకు విధింపతగు శిక్షలను నిర్వచించి, వివరిస్తుంది 'భారతీయ న్యాయ సంహిత'. ఈ చట్టము అమలులోనికి రాక పూర్వము, ఇందుకు సంబంధించి బ్రిటీష్ వలస పాలకుల కాలములో 1860వ సంవత్సరములో భారతీయ శిక్షాస్మృతి రూపొందించబడి (అప్పుడప్పుడు చేయబడ్డ కొన్ని మార్పులు, చేర్పులతో) ఇప్పటివరకు అమలులో ఉన్నది. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణముగా నేరములు, శిక్షలకు సంబంధించిన ఆ చట్టమును పూర్తిగా ప్రక్షాళన చేసి, దాని స్థానములో మరింత ఆచరణాత్మకమైన చట్టమును రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ వాస్తవంలో పౌరహక్కులను, మానవ హక్కులను హరించే విధంగా, నక్సలైట్లు తదితర కమ్యునిస్టు గ్రూపులచే నిర్వహించబడుతున్న ప్రజా ఉద్యమాలను అణచివేసే విధంగా, వామ పక్ష మేధావుల గొంతు నొక్కేవిధంగా, 'ఉపా' వంటి దుర్మార్గపు చట్టాలకు చట్టబద్ధతను కల్పించే విధంగా మరింత దుర్మార్గమైన అప్రజాస్వామిక నిబంధనలతో ఈ క్రొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. తదనుగుణముగానే ఈ 'భారతీయ న్యాయ సంహిత' రూపొందించబడింది. పూర్వపు ఆంగ్ల నామం స్థానంలో హిందీ పేరును (సంస్కృతం) జోడించింది. అనేక తర్జన భర్జనల అనంతరంఈ క్రొత్త చట్టమునకు పార్లమెంటులోని ఉభయ సభలు ఆమోదం తెలుపటంతో, రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఈ క్రొత్త చట్టం ది. 1-7-2024 తేదీ నుండి అమలులోకి వచ్చింది. ఈ నూతన 'భారతీయ న్యాయ సంహిత' యావత్ భారత దేశానికీ వర్తిస్తుంది.
సార్వజనీనమైన, సర్వసాధారణమైన కొన్ని నేరములకు (General Penal Law) ఈ 'భారతీయ న్యాయ సంహిత' వర్తిస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భములకు, ప్రత్యేక నేరములకు సంబంధించి ప్రత్యేకమైన కేంద్ర ప్రభుత్వ నేర శాసనములు అమలులో ఉన్నాయి. ఉదాహరణకు మద్యపాన నిషేధ చట్టము, అవినీతి నిరోధక చట్టము, వ్యభిచార నిరోధక చట్టము, ఫ్యాక్టరీల చట్టము మొదలైనవి. అదేవిధముగా కేవలము ఒక ప్రాంతము లేక రాష్ట్రములకు వర్తించు విధముగా కొన్ని ప్రాంతీయ శాసనములు కూడా అమలులో ఉన్నాయి. ఈ విషయము గమనార్హము.................
భారతీయ న్యాయ సంహిత, 2023 (BHARATIYA NYAYA SANHITA, 2023) భారతదేశములో జరుగు నేరములకు, ఆ నేరములకు విధింపతగు శిక్షలను నిర్వచించి, వివరిస్తుంది 'భారతీయ న్యాయ సంహిత'. ఈ చట్టము అమలులోనికి రాక పూర్వము, ఇందుకు సంబంధించి బ్రిటీష్ వలస పాలకుల కాలములో 1860వ సంవత్సరములో భారతీయ శిక్షాస్మృతి రూపొందించబడి (అప్పుడప్పుడు చేయబడ్డ కొన్ని మార్పులు, చేర్పులతో) ఇప్పటివరకు అమలులో ఉన్నది. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణముగా నేరములు, శిక్షలకు సంబంధించిన ఆ చట్టమును పూర్తిగా ప్రక్షాళన చేసి, దాని స్థానములో మరింత ఆచరణాత్మకమైన చట్టమును రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ వాస్తవంలో పౌరహక్కులను, మానవ హక్కులను హరించే విధంగా, నక్సలైట్లు తదితర కమ్యునిస్టు గ్రూపులచే నిర్వహించబడుతున్న ప్రజా ఉద్యమాలను అణచివేసే విధంగా, వామ పక్ష మేధావుల గొంతు నొక్కేవిధంగా, 'ఉపా' వంటి దుర్మార్గపు చట్టాలకు చట్టబద్ధతను కల్పించే విధంగా మరింత దుర్మార్గమైన అప్రజాస్వామిక నిబంధనలతో ఈ క్రొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. తదనుగుణముగానే ఈ 'భారతీయ న్యాయ సంహిత' రూపొందించబడింది. పూర్వపు ఆంగ్ల నామం స్థానంలో హిందీ పేరును (సంస్కృతం) జోడించింది. అనేక తర్జన భర్జనల అనంతరంఈ క్రొత్త చట్టమునకు పార్లమెంటులోని ఉభయ సభలు ఆమోదం తెలుపటంతో, రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఈ క్రొత్త చట్టం ది. 1-7-2024 తేదీ నుండి అమలులోకి వచ్చింది. ఈ నూతన 'భారతీయ న్యాయ సంహిత' యావత్ భారత దేశానికీ వర్తిస్తుంది. సార్వజనీనమైన, సర్వసాధారణమైన కొన్ని నేరములకు (General Penal Law) ఈ 'భారతీయ న్యాయ సంహిత' వర్తిస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భములకు, ప్రత్యేక నేరములకు సంబంధించి ప్రత్యేకమైన కేంద్ర ప్రభుత్వ నేర శాసనములు అమలులో ఉన్నాయి. ఉదాహరణకు మద్యపాన నిషేధ చట్టము, అవినీతి నిరోధక చట్టము, వ్యభిచార నిరోధక చట్టము, ఫ్యాక్టరీల చట్టము మొదలైనవి. అదేవిధముగా కేవలము ఒక ప్రాంతము లేక రాష్ట్రములకు వర్తించు విధముగా కొన్ని ప్రాంతీయ శాసనములు కూడా అమలులో ఉన్నాయి. ఈ విషయము గమనార్హము.................© 2017,www.logili.com All Rights Reserved.