కృష్ణవర్గాతు వారాహీ మహిషస్థా మహోదరీ
వరదా దండినీ ఇద్దం చిభ్రతీ దక్షిణేకరే
భేట పాత్రాభయాన్ వామే సూకరాప్యా లసద్భుజా
వారాహిదేవి నల్లని శరీరకాంతితో, వరాహముఖంతో, మహిష వాహనం, పెద్దపొట్ట, ఎనిమిది చేతులు కలిగి ఉంటుంది. ఆ చేతుల యందు కుడివైపు క్రింది నుంచి పైకి - 1. అభయముద్ర 2. వేటకత్తి 3. పాత్ర 4. నాగలి, ఎడమవైపు క్రింది నుంచి పైకి 1. గద, 2. శంఖము 3. అంకుశము 4. వరముద్ర కలిగి ఉంటుంది. వరాహ ముఖము కలిగి వుటుంది. ఆ దేవి చేతులందు ఉండే ఆయుధాలలో భిన్నమైన అభిప్రాయా లున్నాయి. కాబట్టి ఇంకొకచోట ఈ ఆయుధాలు వేరుగా ఉండవచ్చు.
రైతులు పంటలు బాగా పండడానికి, చీడపీడల రక్షణకి ఈ దేవిని పూజిస్తారు. ఈవిడ సైన్యాధ్యక్షురాలు. అపారమైన ధైర్యసాహసాలు, పోరాటపటిమ కలిగి ఉంటుంది. కాబట్టి రాజులు, సైన్యము, శత్రువులున్నవారు, కష్టాలలో ఉన్నవారు ఈ దేవిని అర్చిస్తారు.
మంత్రము : ఓం వారాహి సర్వతో మాం రక్ష రక్ష | హుంఫట్ స్వాహా
2. ఈ దేవతకు గాయత్రి :
మహిష వాహనాయై చ విద్మహే దండహస్తాయ ధీమహి
తన్నో వారాహీ ప్రచోదయాత్
వారాహీ దేవతకు క్షేత్రపాలకుడు - ఉన్మత్త భైరవుడు.
ఈయన మూడు కనులు, నాలుగు చేతులు కలిగి, బంగారు చ్ఛాయతో దిగంబరుడుగా ఉంటాడు. చేతులయందు రోకలి, కత్తి, కపాలము, వేటకత్తి ఉంటాయి.
అశ్వము ఈయన వాహనము, పశ్చిమ దిక్కుకు అధిపతి.
దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి ।
తన్నో ఉన్మత్త భైరవ ప్రచోదయాత్...........
© 2017,www.logili.com All Rights Reserved.