ఇది భారత భూమి నడిబొడ్డున హైందవ పుణ్యభూమిగా భావించబడే కాశీనగరంలో జరిగిన యథార్థ సంఘటన. భారత తాత్విక మేథోరంగాన్ని ఒక కుదుపు కుదిపిన చారిత్రక సంఘటన. హైందవ చరిత్రకారుల ప్రకారం శంకరా చార్యులు సాక్షాత్ శివ స్వరూపం. అతనికి ఒక సందర్భంలో 'చండాలుడు' ఎదురొచ్చి తత్వాన్ని బోధించి జ్ఞానోదయం కలిగిస్తాడు. 'శివుడు చండాలుని రూపంలో వచ్చారు' అనేది హైందవ చరిత్రకారుల అభిప్రాయం. ఒక శివునికి మరొక శివుడు ఎదురొచ్చి జ్ఞానోదయం కల్పించి నట్లుగా చరిత్రను వక్రీకరించారు. ఇది ఎలా సాధ్యం?
భారతదేశపు తాత్వికరంగంలో హైందవ, బౌద్ధ వాజ్ఞ్మయాలను ఔపోసన పట్టిన మహా తాత్వికులు, మహా విజ్ఞాని 'ఆచార్య చండాలుడు'. ఒకే దేశంలో ఒకే సమయంలో, ఒకే ప్రదేశంలో శంకరా చార్యులు, ఛండాలుడు లాంటి ఇద్దరు తాత్వికులు వుండడం తప్పు కాదు గదా! ఇద్దరు హైందవులైతే వారిని గురించి వ్రాసేవారు. కాని 'ఛండాలుడు' అంటరాని కులంలో పుట్టిన వ్యక్తి. అందుకే హైందవ చరిత్రకారులు అతని గురించి వ్రాయలేదు. వాస్తవ చరిత్ర ఏమిటో తెలియజేయాలని నేను ఈ గ్రంథాన్ని వ్రాయాల్సి వచ్చినది.
- బొనిగల రామారావు