పద్మ విభూషణ్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి గారు (1929 - 2011) ఆంధ్రవిశ్వ విద్యాలయంలో పాతికేళ్లకు పైగా తత్త్వశాస్త్రం బోధించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా యుజిసి వైస్ చైర్మన్ గా పనిచేశారు. ఇండియన్ ఫిలాసఫికల్ కాంగ్రెస్ చైర్మన్ గా ఉన్నారు. సమకాలీన భారతీయ తత్త్వవేత్తలలో అత్యంత ఆసక్తిని రేకెత్తించే దార్శనికుడాయన. భారతీయ తత్త్వశాస్త్రం సంస్కృతీ మతం - ముఖ్యంగా వేదాంతంపై అయన రచనలు సూక్ష్మ విశ్లేషణను అందిస్తూ, నూతన అధ్యయనాలను ప్రదర్శిస్తాయి.
ఇంగ్లీషులోను తెలుగులోను హిందీలోనూ తత్త్వశాస్త్రంపై అనేక గ్రంథాలను రచించారు, అనువదించారు, సంపాదకత్వం వహించారు.
- ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్