మానవులు అనుభవిస్తున్న సమస్యల్లో ప్రధానమైంది నేరం. అది ప్రదేశాన్ని బట్టీ, కాలాన్ని బట్టీ మారుతూ ఉండవచ్చు. నేరం అనేది సమాజంలో సంక్లిష్టమైన సమస్య. అసమానత్వం, ఆర్ధిక దోపిడీ, సంపదను కబళించాలానే అనారోగ్యకరమైన దురాశ సమాజంలోని నైతిక పరిస్థితులను కుంగదీసి, నేరం పెరగడానికి అవకాశం కల్పిస్తాయి. పుట్టుకతో ఎవరూ నేరస్థుడు కాదు. సామాజిక వాతావరణ ప్రభావం మనిషి నడవడికకు కారణం. నేరస్థులనే ముద్ర సామాజికంగా ప్రతి ఒక్కరిని కుంగదీస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. కుటుంబ సంబంధాలు కుంటుపడి, నిరాశతో నిస్పృహతో జీవితంలో చేవ సన్నగిల్లి, మనుషులంటే ఈర్ష్య, ద్వేషం, అసూయ పెంచుకుంటారు.
సామాజికంగా కుటుంబ వ్యవస్థ శిధిలమై, విద్య లేక, నేరస్థులనే ముద్రతో సతమతమౌతూ, బతుకుదెరువు కొరవైన జీవితాలను సంస్కరించటం చాలా పెద్ద పని, క్లిష్టమైన పని కూడా, వాళ్ళను మామూలు మనుషులను చేసి, సామాజిక జీవన మాధుర్యాన్ని వాళ్ళు కూడా అనుభవించేటట్లు చేయటం సంస్కర్తల బాధ్యత. ఆ బాధ్యతనే గోరా నుంచి హేమలతా లవణం వరకు తమ శక్తి వంచనలేకుండా పనిచేసి విజయాన్ని సాధించారు. నేరస్థులనే మాటకు బదులు విముక్త జాతులని పిలుస్తూ ఎంతో కృషి చేశారు.
ఈ గ్రంథ ప్రత్యేకత సుందర్ సంపాదించిన కేసు అధ్యయనాలు. ఈ గ్రంథంలో వాడిన విషయాలన్నీ ఆర్కైమ్స్ కు సంబంధించినవి. అలాగే క్షేత్ర పరిశోధనకు సంబంధించినవి. ఈ గ్రంథాన్ని తెలుగులో రాయటం మా అందరి అదృష్టం.
- పకుళాభరణం లలితా, మల్లిగాంధి, కొంపల్లి సుందర్
మానవులు అనుభవిస్తున్న సమస్యల్లో ప్రధానమైంది నేరం. అది ప్రదేశాన్ని బట్టీ, కాలాన్ని బట్టీ మారుతూ ఉండవచ్చు. నేరం అనేది సమాజంలో సంక్లిష్టమైన సమస్య. అసమానత్వం, ఆర్ధిక దోపిడీ, సంపదను కబళించాలానే అనారోగ్యకరమైన దురాశ సమాజంలోని నైతిక పరిస్థితులను కుంగదీసి, నేరం పెరగడానికి అవకాశం కల్పిస్తాయి. పుట్టుకతో ఎవరూ నేరస్థుడు కాదు. సామాజిక వాతావరణ ప్రభావం మనిషి నడవడికకు కారణం. నేరస్థులనే ముద్ర సామాజికంగా ప్రతి ఒక్కరిని కుంగదీస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. కుటుంబ సంబంధాలు కుంటుపడి, నిరాశతో నిస్పృహతో జీవితంలో చేవ సన్నగిల్లి, మనుషులంటే ఈర్ష్య, ద్వేషం, అసూయ పెంచుకుంటారు. సామాజికంగా కుటుంబ వ్యవస్థ శిధిలమై, విద్య లేక, నేరస్థులనే ముద్రతో సతమతమౌతూ, బతుకుదెరువు కొరవైన జీవితాలను సంస్కరించటం చాలా పెద్ద పని, క్లిష్టమైన పని కూడా, వాళ్ళను మామూలు మనుషులను చేసి, సామాజిక జీవన మాధుర్యాన్ని వాళ్ళు కూడా అనుభవించేటట్లు చేయటం సంస్కర్తల బాధ్యత. ఆ బాధ్యతనే గోరా నుంచి హేమలతా లవణం వరకు తమ శక్తి వంచనలేకుండా పనిచేసి విజయాన్ని సాధించారు. నేరస్థులనే మాటకు బదులు విముక్త జాతులని పిలుస్తూ ఎంతో కృషి చేశారు. ఈ గ్రంథ ప్రత్యేకత సుందర్ సంపాదించిన కేసు అధ్యయనాలు. ఈ గ్రంథంలో వాడిన విషయాలన్నీ ఆర్కైమ్స్ కు సంబంధించినవి. అలాగే క్షేత్ర పరిశోధనకు సంబంధించినవి. ఈ గ్రంథాన్ని తెలుగులో రాయటం మా అందరి అదృష్టం. - పకుళాభరణం లలితా, మల్లిగాంధి, కొంపల్లి సుందర్© 2017,www.logili.com All Rights Reserved.