ఈ నవలలో కేంద్ర బిందువు సంధ్య. ఆమె ఆస్తి తన శరీర సౌందర్యమే. దానితోనే ఆమె ఆర్జన చేస్తుంది. కాని ఎంత శీల భ్రష్టజీవితమైనా ఆమెలోనూ మానవీయ విలువలు ఉన్నాయి. మంత్రులూ, కంట్రాక్టర్లూ, భోగభాగ్యాలలో పొర్లాడే మరికొందరు అక్రమ ధన స్వాములూ ఆమె చుట్టూ తిరుగుతుండటం నవల ఇతివృత్తం. "రాజకీయాలలో వున్నవాళ్ళు, చేరేవారు అందరూ అవినీతికి పట్టం కట్టుతారు అనుకొనటం భావ్యం కాదు. మంచివారు కూడా వున్నారు, వుంటారు..." అని రచయిత విశ్వాసం కనుక నవలలో దుష్ట పాత్రల సరసన కొన్ని మంచి పాత్రలూ కనిపిస్తాయి.
రాజకీయాలలో ఉన్న వ్యక్తులు కొందరికి రాజకీయాలు ఎలా జగుప్స కలిగిస్తాయో ఈ నవల చదివాక తెలుస్తుంది. ఎప్పటికైనా మంచి జరుగుతుందనే ఆశాభావాన్ని కూడా ఈ నవల కలిగిస్తుంది. పాత్రల మధ్య సంభాషణలు పఠితల మనస్సులో రాజకీయ రంగం ఇంత అధోగతిలో ఉన్నదేమిటనే ఆలోచనలు కలిగిస్తాయనడంలోనూ సందేహం లేదు.
ఈ నవలలో కేంద్ర బిందువు సంధ్య. ఆమె ఆస్తి తన శరీర సౌందర్యమే. దానితోనే ఆమె ఆర్జన చేస్తుంది. కాని ఎంత శీల భ్రష్టజీవితమైనా ఆమెలోనూ మానవీయ విలువలు ఉన్నాయి. మంత్రులూ, కంట్రాక్టర్లూ, భోగభాగ్యాలలో పొర్లాడే మరికొందరు అక్రమ ధన స్వాములూ ఆమె చుట్టూ తిరుగుతుండటం నవల ఇతివృత్తం. "రాజకీయాలలో వున్నవాళ్ళు, చేరేవారు అందరూ అవినీతికి పట్టం కట్టుతారు అనుకొనటం భావ్యం కాదు. మంచివారు కూడా వున్నారు, వుంటారు..." అని రచయిత విశ్వాసం కనుక నవలలో దుష్ట పాత్రల సరసన కొన్ని మంచి పాత్రలూ కనిపిస్తాయి. రాజకీయాలలో ఉన్న వ్యక్తులు కొందరికి రాజకీయాలు ఎలా జగుప్స కలిగిస్తాయో ఈ నవల చదివాక తెలుస్తుంది. ఎప్పటికైనా మంచి జరుగుతుందనే ఆశాభావాన్ని కూడా ఈ నవల కలిగిస్తుంది. పాత్రల మధ్య సంభాషణలు పఠితల మనస్సులో రాజకీయ రంగం ఇంత అధోగతిలో ఉన్నదేమిటనే ఆలోచనలు కలిగిస్తాయనడంలోనూ సందేహం లేదు.© 2017,www.logili.com All Rights Reserved.