పలుకు కాస్త పలకమారిన తర్వాత, మాట తీరు మరికాస్త పట్టుబడిన తర్వాత ఏదైనా చెప్పగలమనే అనుకుంటాం, కానీ అది సాధ్యమేనా? నిజంగా అది అనుకున్నంత తేలిక కాదు. మనిషి గురించి చెప్పమంటే ఏవో నాలుగు మాటలు చెప్పి ఒప్పించవచ్చు. మాను మాకుల గురించో, కొండకోనల గురించో చెప్పమన్నప్పుడు ఏదో ఒక వివరం చెప్పి, ఔనౌను అనిపించేయవచ్చు. కథ గురించో కావ్యం గురించో, కవి గురించో అడిగినా అలవోకగా అభిప్రాయము చెప్పవచ్చు. మాటతీరు ఎంత కండపట్టినా, చెప్పలేనిది ఒకటుంది. అదే కవిత్వమంటే ఏమిటని? కవిత్వానికి నిర్వచనాలు శతాబ్దాలుగా చెబుతూనే వచ్చారు. ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. అయినా ఈ నిర్వచనం బావుందే, అని మనం తృప్తిపడిన దాఖలా ఒకటీ లేదు. ఏ నిర్వచనం విన్నా, ఇంకా ఎదో చెప్పవచ్చునేమో, అని మనసు ఎదో ఒక లోటును ఏకరువు పెడుతూనే ఉంటుంది.
కవిత్వానికి, కవిలో బీజప్రాయంగా అంకురించిన మొలక చివురులు ప్రధానం. అలా మొలక వేసిన భావనలను తన ప్రకటనా పటిమతో, శ్రోతకో, పాఠకునికో చేర్చగలిగితే, ఆ కవితకు నిలకడ దొరికినట్లే, ఆ కవికి కవయిత్రికి ఉనికి ఏర్పడినట్లే. అలా తన కవితలకు పదినాళ్ళ ఆయునిచ్చి, తన ఉనికిని చాటుకున్న కవయిత్రి విజయలక్ష్మి పండిట్.
పలుకు కాస్త పలకమారిన తర్వాత, మాట తీరు మరికాస్త పట్టుబడిన తర్వాత ఏదైనా చెప్పగలమనే అనుకుంటాం, కానీ అది సాధ్యమేనా? నిజంగా అది అనుకున్నంత తేలిక కాదు. మనిషి గురించి చెప్పమంటే ఏవో నాలుగు మాటలు చెప్పి ఒప్పించవచ్చు. మాను మాకుల గురించో, కొండకోనల గురించో చెప్పమన్నప్పుడు ఏదో ఒక వివరం చెప్పి, ఔనౌను అనిపించేయవచ్చు. కథ గురించో కావ్యం గురించో, కవి గురించో అడిగినా అలవోకగా అభిప్రాయము చెప్పవచ్చు. మాటతీరు ఎంత కండపట్టినా, చెప్పలేనిది ఒకటుంది. అదే కవిత్వమంటే ఏమిటని? కవిత్వానికి నిర్వచనాలు శతాబ్దాలుగా చెబుతూనే వచ్చారు. ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. అయినా ఈ నిర్వచనం బావుందే, అని మనం తృప్తిపడిన దాఖలా ఒకటీ లేదు. ఏ నిర్వచనం విన్నా, ఇంకా ఎదో చెప్పవచ్చునేమో, అని మనసు ఎదో ఒక లోటును ఏకరువు పెడుతూనే ఉంటుంది. కవిత్వానికి, కవిలో బీజప్రాయంగా అంకురించిన మొలక చివురులు ప్రధానం. అలా మొలక వేసిన భావనలను తన ప్రకటనా పటిమతో, శ్రోతకో, పాఠకునికో చేర్చగలిగితే, ఆ కవితకు నిలకడ దొరికినట్లే, ఆ కవికి కవయిత్రికి ఉనికి ఏర్పడినట్లే. అలా తన కవితలకు పదినాళ్ళ ఆయునిచ్చి, తన ఉనికిని చాటుకున్న కవయిత్రి విజయలక్ష్మి పండిట్.© 2017,www.logili.com All Rights Reserved.