దేశానికీ స్వాతంత్ర్యం వచ్చిన రోజులవి. గత శతాబ్ది ఐదవ దశకంలో దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులు నెమ్మదిగా మార్పుకు లోనవుతున్నాయి. రాయలసీమ ప్రాంతం రాష్ట్రంలో వెనుకపడిన ప్రాంతం. ఆర్ధికంగా వెనుకబడినా, ఆప్యాయతలు అనుబంధాలకు పెట్టింది పేరు. చిత్తూరు జిల్లా, గుడిపాల మండలంలో, సంగమంగళం గ్రామం ప్రధానమైన గ్రామాల్లో ఒకటి. ఈ ప్రాంతానికి తమిళనాడు అతిచేరువలో ఉంది. దాదాపు తమిళభాష వాడుకలో ఉంది. మంది కృష్ణాపురం, కనకనేరి , సంగమంగళం, గట్రాళ్లమిట్ట, బొమ్మ సముద్రం, మరకాల కుప్పం, పానాటూరు మొదలైన పంచాయితీలు బొమ్మ సముద్రం ప్రాంతం గానే పిలువబడేవి. భౌగోళికంగా పై గ్రామాలు ఒక గొడుగు కిందికి వచ్చాయి. కాట్పాడి - చిత్తూరు రైలు మార్గం , వెల్లూరు - చిత్తూరు బస్సు మార్గం, చెన్నపట్నం - బెంగుళూరు జాతీయ రాస్తా - ఈ గ్రామాల మీదుగా పోతాయి.