హిందూత్వ సిద్ధాంతాన్ని విశ్వసించే వారు భారతదేశ అధికార రథసారథులు ఈనాడు. ఈ పదం దానికి రూపకల్పన చేసింది వినాయక్ దామోదర్ సావర్కర్. 'హిందూత్వ' అనే వ్యాసాన్ని 1923 లో ఆయన ప్రచురించారు. ఈ వ్యాసంలో 'హిందూత్వ' అనే ఆ పదాన్ని కొత్తగా రూపొందించినా దీనిని హిందూమతంతో సమానంగా చూపేందుకు అనేకులు అదే పనిగా ప్రయత్నిస్తున్నారు. స్వామి వివేకానందగాని, స్వామి రామతీర్థగాని, ఆ మాటకొస్తే ఎంతో ఔన్నత్యంగల విశ్వాసాన్ని ప్రచారం చేసిన ఇతర మహత్తర వ్యక్తులెవరూ ఈ పదాన్ని ఉపయోగించలేదు. సావర్కర్ నిరీశ్వరవాది. మతం, తత్వశాస్త్రాల విషయంలో కృషి చేసేందుకు ఆయనకు సమయమేలేదు. ఆ ఒక్క నిజం చాలు 'హిందూత్వ' అనేది ఒక రాజకీయ తత్వశాస్త్రం తప్ప, మతంతో దానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేందుకు. ఆయన రాజకీయ కార్యకలాపాలలో మునిగితేలారు. తన విద్వేష రాజకీయాల కోసం చరిత్రను ఉపయోగించుకున్నారు.
హిందూత్వ సిద్ధాంతాన్ని విశ్వసించే వారు భారతదేశ అధికార రథసారథులు ఈనాడు. ఈ పదం దానికి రూపకల్పన చేసింది వినాయక్ దామోదర్ సావర్కర్. 'హిందూత్వ' అనే వ్యాసాన్ని 1923 లో ఆయన ప్రచురించారు. ఈ వ్యాసంలో 'హిందూత్వ' అనే ఆ పదాన్ని కొత్తగా రూపొందించినా దీనిని హిందూమతంతో సమానంగా చూపేందుకు అనేకులు అదే పనిగా ప్రయత్నిస్తున్నారు. స్వామి వివేకానందగాని, స్వామి రామతీర్థగాని, ఆ మాటకొస్తే ఎంతో ఔన్నత్యంగల విశ్వాసాన్ని ప్రచారం చేసిన ఇతర మహత్తర వ్యక్తులెవరూ ఈ పదాన్ని ఉపయోగించలేదు. సావర్కర్ నిరీశ్వరవాది. మతం, తత్వశాస్త్రాల విషయంలో కృషి చేసేందుకు ఆయనకు సమయమేలేదు. ఆ ఒక్క నిజం చాలు 'హిందూత్వ' అనేది ఒక రాజకీయ తత్వశాస్త్రం తప్ప, మతంతో దానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేందుకు. ఆయన రాజకీయ కార్యకలాపాలలో మునిగితేలారు. తన విద్వేష రాజకీయాల కోసం చరిత్రను ఉపయోగించుకున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.