తెలంగాణా మొదట్నుంచీ పోరాటాల పురిటిగడ్డ. నిరంకుశత్వం, బానిస తత్వం ఎక్కడ ఉన్నా పోరాడినవాడు తెలంగాణా పులిబిడ్డ. ఆంగ్లేయుల ఆధిపత్యానికి వ్యతిరకంగానూ, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగానూ కదంతొక్కిన జనమే - స్వాతంత్ర్య పోరాటం, రైతాంగ సాయుధ పోరాటం బాట పట్టిన చరిత్ర మనది. రకరకాల రాజవంశాల పాలనలలోనూ అభివృద్ధి జరగలేదని అనలేంకాని ప్రజల సౌకర్యాలు, భాషా, మత, సంస్కృతుల వికాసాలూ ఏ పాటిగా ఉన్నాయన్నది ఈ తరం తెలుసుకోవాలి.
గుడ్డిగా నాటి పాలకవర్గాలను పైకెత్తడం గానీ, దుమ్మెత్తి పొయ్యడం గానీ అంత మంచిది కాదు. పాలకులు తమను అణచేస్తున్నారన్న చైతన్యం కల్గిన ప్రతి సందర్భంలోనూ ప్రజలు పోరాటబాట పట్టారు. అణచివేతపై తొడగొట్టి సవాలన్నారు. ఇలాంటి చాలా విషయాలను ఈ చిన్న ప్రయత్నం వివరిస్తోంది. వివిధ ఉద్యమాలతో అవి తెలంగాణను ప్రభావితం చేసిన సందర్భాలనూ, వీటి వెనక ఉన్న శక్తులనూ, వ్యక్తులనూ, సంస్థలనూ మన ముందుంచే చిన్న ప్రయత్నం ఇది.
తెలంగాణా మొదట్నుంచీ పోరాటాల పురిటిగడ్డ. నిరంకుశత్వం, బానిస తత్వం ఎక్కడ ఉన్నా పోరాడినవాడు తెలంగాణా పులిబిడ్డ. ఆంగ్లేయుల ఆధిపత్యానికి వ్యతిరకంగానూ, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగానూ కదంతొక్కిన జనమే - స్వాతంత్ర్య పోరాటం, రైతాంగ సాయుధ పోరాటం బాట పట్టిన చరిత్ర మనది. రకరకాల రాజవంశాల పాలనలలోనూ అభివృద్ధి జరగలేదని అనలేంకాని ప్రజల సౌకర్యాలు, భాషా, మత, సంస్కృతుల వికాసాలూ ఏ పాటిగా ఉన్నాయన్నది ఈ తరం తెలుసుకోవాలి. గుడ్డిగా నాటి పాలకవర్గాలను పైకెత్తడం గానీ, దుమ్మెత్తి పొయ్యడం గానీ అంత మంచిది కాదు. పాలకులు తమను అణచేస్తున్నారన్న చైతన్యం కల్గిన ప్రతి సందర్భంలోనూ ప్రజలు పోరాటబాట పట్టారు. అణచివేతపై తొడగొట్టి సవాలన్నారు. ఇలాంటి చాలా విషయాలను ఈ చిన్న ప్రయత్నం వివరిస్తోంది. వివిధ ఉద్యమాలతో అవి తెలంగాణను ప్రభావితం చేసిన సందర్భాలనూ, వీటి వెనక ఉన్న శక్తులనూ, వ్యక్తులనూ, సంస్థలనూ మన ముందుంచే చిన్న ప్రయత్నం ఇది.© 2017,www.logili.com All Rights Reserved.