'ఎందుకు? ఏమిటి? ఎలా?' ఈ మూడు ప్రశ్నలు జ్ఞాన భీజములు. ఈ ప్రశ్నా భీజాలు మనిషి మెదడులో మొలకెత్తినచో ఆ మనిషి మహా వృక్షం వలె మహాజ్ఞాని కాగలడు. కానీ ప్రశ్నా భీజాలు మొలకెత్తని మనిషి మెదడు ఒక విధంగా సారంలేని మట్టి లాంటిది. ఎందుకంటే 'ప్రశ్న తోడ బుట్టున్ జ్ఞానంబు' అన్నారు. ప్రశ్నించడం చేతగాని వాడు చలనం లేని రాయితో సమానం.
'నేను ఎక్కడ ఉన్నాను ?' అని ప్రశ్నించుకుంటే నీవు ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. ప్రశ్న దారి చూపిస్తుంది. కానీ 'నేను ఏమి చేయాలి?' అని ఎవ్వరినీ అడగకు. ఎందుకంటే నీకంటూ ఒక క్లారిటీ వుండాలి.
కపలివస్తు లేక లుంబిని (ఇప్పుడు నేపాల్) లో పుట్టిన సిద్ధార్థుడు ఒక రోజు పుర వీధులలో రథం మీద సంచరించుచు తెల్లజుట్టుతో కర్రపట్టుకుని వంగి నడుస్తున్న ఒక ముసలివాణ్ణి, నలుగురు మోస్తున్న ఒక శవాన్ని, ఒక బిక్షగాణ్ణి చూసి చలించిపోయి 'అసలు మనషి దు:ఖానికి కారణం ఏమిటి?' అని ప్రశ్నించుకున్నాడు. అంతే ఆ ప్రశ్నకు సమాధానం కోసం తపస్సు చేసి, జ్ఞానాన్ని పొంది సిద్ధార్థుడు బుద్ధుడుగా మారాడు. ఒక ప్రశ్న యువరాజు సిద్ధార్థుడుని బుద్ధునిగా మార్చింది.
ప్రపంచంలో ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఎన్నో సౌకర్యాలు మరియు సాధనాలు ప్రశ్న నుంచి ఉద్భవించినవే. ప్రశ్న మానవ సోదనకు మూలం. అసలు ప్రశ్నే లేకుంటే మనుగడే లేదు. ఇందులో పొందుపరచిన విషయాలు ఎందరో శాస్త్రవేత్తలు మరియు శాస్త్రజ్ఞులు పరిశీలించి, పరిశోధించి చెప్పబడినవి.
- పట్టంశెట్టి రవి
'ఎందుకు? ఏమిటి? ఎలా?' ఈ మూడు ప్రశ్నలు జ్ఞాన భీజములు. ఈ ప్రశ్నా భీజాలు మనిషి మెదడులో మొలకెత్తినచో ఆ మనిషి మహా వృక్షం వలె మహాజ్ఞాని కాగలడు. కానీ ప్రశ్నా భీజాలు మొలకెత్తని మనిషి మెదడు ఒక విధంగా సారంలేని మట్టి లాంటిది. ఎందుకంటే 'ప్రశ్న తోడ బుట్టున్ జ్ఞానంబు' అన్నారు. ప్రశ్నించడం చేతగాని వాడు చలనం లేని రాయితో సమానం. 'నేను ఎక్కడ ఉన్నాను ?' అని ప్రశ్నించుకుంటే నీవు ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. ప్రశ్న దారి చూపిస్తుంది. కానీ 'నేను ఏమి చేయాలి?' అని ఎవ్వరినీ అడగకు. ఎందుకంటే నీకంటూ ఒక క్లారిటీ వుండాలి. కపలివస్తు లేక లుంబిని (ఇప్పుడు నేపాల్) లో పుట్టిన సిద్ధార్థుడు ఒక రోజు పుర వీధులలో రథం మీద సంచరించుచు తెల్లజుట్టుతో కర్రపట్టుకుని వంగి నడుస్తున్న ఒక ముసలివాణ్ణి, నలుగురు మోస్తున్న ఒక శవాన్ని, ఒక బిక్షగాణ్ణి చూసి చలించిపోయి 'అసలు మనషి దు:ఖానికి కారణం ఏమిటి?' అని ప్రశ్నించుకున్నాడు. అంతే ఆ ప్రశ్నకు సమాధానం కోసం తపస్సు చేసి, జ్ఞానాన్ని పొంది సిద్ధార్థుడు బుద్ధుడుగా మారాడు. ఒక ప్రశ్న యువరాజు సిద్ధార్థుడుని బుద్ధునిగా మార్చింది. ప్రపంచంలో ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఎన్నో సౌకర్యాలు మరియు సాధనాలు ప్రశ్న నుంచి ఉద్భవించినవే. ప్రశ్న మానవ సోదనకు మూలం. అసలు ప్రశ్నే లేకుంటే మనుగడే లేదు. ఇందులో పొందుపరచిన విషయాలు ఎందరో శాస్త్రవేత్తలు మరియు శాస్త్రజ్ఞులు పరిశీలించి, పరిశోధించి చెప్పబడినవి. - పట్టంశెట్టి రవి© 2017,www.logili.com All Rights Reserved.