విజ్ఞానులను అజ్ఞానులు హేళన చేసే కాలం ఇది! విజ్ఞానమూ, యదార్థము తెలుసుకునే ఓపిక లేకపోయినా - విమర్శలు చేసే కుయుక్తిమాత్రం ఈ రోజుల్లో హెచ్చుగా వుంది. పురాణాలంటే తెలియని వ్యక్తులు కూడా వాటి గురించి తమకు నచ్చిన రీతిలో వ్యాఖ్యానాలు చేసేస్తూ ఉంటారు.
'పురాణాలు జరిగాయా?' అని ప్రశ్నించుకుందాం ఒకసారి. మన చరిత్ర మాత్రం పురాణకాలపు ఆధారాలను అందుకోలేకపోతోంది. ఎందువల్లనంటే, పురాణ కాలం కొన్ని లక్షల సంవత్సరాల వెనక్కి ఉంది. అయితే కనీసం పురాణాల్లో చెప్పిన విషయాలు యదార్థాలా? కాదా? అనే విషయాన్ని చూద్దాం. నేటి ఆధునిక సైన్సు చెప్తున్న ఎన్నో అంశాలు మనకు పురాణాల్లో కన్పిస్తున్నాయి. పురాణాల్లో ఉన్న వివిధ శాస్త్ర విషయాలు, నేడు ఒక్కొక్కటీ నిరూపణలోకి వస్తున్నాయి.
- పోలిశెట్టి బ్రదర్స్