పరిశోధనాంశాన్ని ఎన్నుకున్న తరువాత పరిశోధకుడు పరిశోధన ప్రణాళికను రూపకల్పన చేస్తాడు. పరిశోధన క్రమబద్ధంగా, హేతుబద్ధంగా ఉండాలి కాబట్టి సరైన ప్రణాళిక తప్పనిసరి. ప్రణాలికాబద్ధం కాని పరిశోధనా కార్యక్రమం ఆశించిన ఫలితాలను ఇవ్వదు. ఉదాహరణకు ఒక భవనాన్ని నిర్మించాలనుకున్నప్పుడు భవనం నమూనాను ముందుగానే తయారు చేసుకుంటాం. భవన నిర్మాణ భాగాలన్నిటిని నమూనా రూపొందించినపుడే నిర్ణయించుకుంటాం. ఎన్ని గదులు ఉండాలి? గదుల వైశాల్యం ఎంత ఉండాలి? ద్వారాలు, కిటికీలు ఎలా ఉండాలి. నిర్మాణానికి ఏ వస్తువులు ఉపయోగించాలి? మొదలైన ప్రశ్నలను సమాధానాలు ముందుగానే నిర్ణయించుకుంటాం. పరిశోధన కార్యక్రమం కూడా ఇలాంటిదే. ప్రణాళిక తప్పనిసరి. శాస్త్రీయ పద్ధతిలో పరిశోధన సాగించడానికి ప్రతి పరిశోధకుడు తప్పనిసరిగా పరిశోధన ప్రణాలికను రూపొందించుకోవాలి.
పరిశోధనాంశాన్ని ఎన్నుకున్న తరువాత పరిశోధకుడు పరిశోధన ప్రణాళికను రూపకల్పన చేస్తాడు. పరిశోధన క్రమబద్ధంగా, హేతుబద్ధంగా ఉండాలి కాబట్టి సరైన ప్రణాళిక తప్పనిసరి. ప్రణాలికాబద్ధం కాని పరిశోధనా కార్యక్రమం ఆశించిన ఫలితాలను ఇవ్వదు. ఉదాహరణకు ఒక భవనాన్ని నిర్మించాలనుకున్నప్పుడు భవనం నమూనాను ముందుగానే తయారు చేసుకుంటాం. భవన నిర్మాణ భాగాలన్నిటిని నమూనా రూపొందించినపుడే నిర్ణయించుకుంటాం. ఎన్ని గదులు ఉండాలి? గదుల వైశాల్యం ఎంత ఉండాలి? ద్వారాలు, కిటికీలు ఎలా ఉండాలి. నిర్మాణానికి ఏ వస్తువులు ఉపయోగించాలి? మొదలైన ప్రశ్నలను సమాధానాలు ముందుగానే నిర్ణయించుకుంటాం. పరిశోధన కార్యక్రమం కూడా ఇలాంటిదే. ప్రణాళిక తప్పనిసరి. శాస్త్రీయ పద్ధతిలో పరిశోధన సాగించడానికి ప్రతి పరిశోధకుడు తప్పనిసరిగా పరిశోధన ప్రణాలికను రూపొందించుకోవాలి.© 2017,www.logili.com All Rights Reserved.