ఈ పుస్తకంలో నిజంగా కథలన్నీ నందివర్ధనం అంత స్వచ్చమైనవి, తెల్లనైనవి. 'నందిని' కథలో ప్రేమను పంచే, పెంచే నందిని సేవాభావంతో జీవితాన్ని సంఘానికి అంకితం చేసిన వైనం ఆలోచింపచేస్తుంది. ప్రేమ కక్షని, కార్పణ్యాన్ని అవమానాన్ని వదిలి ప్రేమించిన వ్యక్తికి ఆనందాన్ని కల్గించినపుడే అది నిజమైన ప్రేమ అని నిరూపించే 'సర్వేజనా సుఖినోభవంతు' కథ నిజంగా మంచి కథే. సెంటిమెంట్ పుష్కలంగా పండే కథలు 'అమ్మమ్మ కడియాలు', 'ట్రంకు పెట్టె' లు.
ఎం ఆర్ వి తను చూసిన, అనుభవించిన సంగతులు మాలగా కట్టిన కథ ' పల్లె నవ్వాలి' చదివినపుడు మనసు ఆనందంతో నిండిపోతుంది. మొత్తానికి ఈ పదహారు కథలు చదివినపుడు మంచి కథా సంకలనం బయిల్పడిందన్న తృప్తి కలుగుతుంది. హృదయంలోకి చొరబడి, పీట వేసుకుని కూర్చుని, మృష్టాన్న భోజనం ఆరగించి, ఆనందంతో ఆలోచించే కథల సమాహారమే 'నందిని - నందివర్ధనం' సంపుటి. రచయితకు అభినందన చందన మాల సమర్పిస్తూ...
- మాడుగుల రామకృష్ణ
ఈ పుస్తకంలో నిజంగా కథలన్నీ నందివర్ధనం అంత స్వచ్చమైనవి, తెల్లనైనవి. 'నందిని' కథలో ప్రేమను పంచే, పెంచే నందిని సేవాభావంతో జీవితాన్ని సంఘానికి అంకితం చేసిన వైనం ఆలోచింపచేస్తుంది. ప్రేమ కక్షని, కార్పణ్యాన్ని అవమానాన్ని వదిలి ప్రేమించిన వ్యక్తికి ఆనందాన్ని కల్గించినపుడే అది నిజమైన ప్రేమ అని నిరూపించే 'సర్వేజనా సుఖినోభవంతు' కథ నిజంగా మంచి కథే. సెంటిమెంట్ పుష్కలంగా పండే కథలు 'అమ్మమ్మ కడియాలు', 'ట్రంకు పెట్టె' లు. ఎం ఆర్ వి తను చూసిన, అనుభవించిన సంగతులు మాలగా కట్టిన కథ ' పల్లె నవ్వాలి' చదివినపుడు మనసు ఆనందంతో నిండిపోతుంది. మొత్తానికి ఈ పదహారు కథలు చదివినపుడు మంచి కథా సంకలనం బయిల్పడిందన్న తృప్తి కలుగుతుంది. హృదయంలోకి చొరబడి, పీట వేసుకుని కూర్చుని, మృష్టాన్న భోజనం ఆరగించి, ఆనందంతో ఆలోచించే కథల సమాహారమే 'నందిని - నందివర్ధనం' సంపుటి. రచయితకు అభినందన చందన మాల సమర్పిస్తూ... - మాడుగుల రామకృష్ణ© 2017,www.logili.com All Rights Reserved.