'సూక్తి' అంటే మంచి మాట అని అర్థం. 'సు' అంటే మంచి అని, 'ఉక్తి' అంటే మాట అని అర్థం. ప్రజలను సంస్కారవంతులుగా, ఉత్తములుగా తీర్చిదిద్దడమే సూక్తి యొక్క ప్రయోజనం. మానవుడు సంఘజీవి. పది మందితో కలిసి మెలిసి తిరగవలసిన వాడు. సూక్తి పరమార్థం తెలిసినవాడు దాన్ని అత్యంత మెలుకువతో ఉపయోగించుకొని ధర్మబద్ధంగా తన పనులు నెరవేర్చుకోగల్గుతాడు. పదిమందితో మంచి మనిషిగా పేరు తెచ్చుకోగలుగుతాడు. దీన్ని బట్టే 'నోరు మంచి దయితే ఊరు మంచి దావుతుందన్న' సామెత పుట్టింది. కాబట్టే ఎవరు చెప్పినా వినాలి. ఏ తీరులో లభ్యమైనా గ్రహించాలి. దీనికి ఎల్లలు లేవు.
సుభాషితం అన్నా సూక్తి అన్నా ఒకే అర్థం. కావ్య ప్రయోజనాలు చెప్పేటప్పుడు కూడా మన అలంకారికులు - ఉపదేశం ఒక ప్రయోజనంగా చెప్పారు. ఉపదేశం అంటే మంచి చెప్పడమనే అర్థం. ఇవాళ వ్యక్తిత్వ వికాసానికి, సంభాషణ నైపుణ్యానికి ప్రజాజీవితంలో ఎంతో ప్రాధాన్యం కనిపిస్తుంది.
'సూక్తి' అంటే మంచి మాట అని అర్థం. 'సు' అంటే మంచి అని, 'ఉక్తి' అంటే మాట అని అర్థం. ప్రజలను సంస్కారవంతులుగా, ఉత్తములుగా తీర్చిదిద్దడమే సూక్తి యొక్క ప్రయోజనం. మానవుడు సంఘజీవి. పది మందితో కలిసి మెలిసి తిరగవలసిన వాడు. సూక్తి పరమార్థం తెలిసినవాడు దాన్ని అత్యంత మెలుకువతో ఉపయోగించుకొని ధర్మబద్ధంగా తన పనులు నెరవేర్చుకోగల్గుతాడు. పదిమందితో మంచి మనిషిగా పేరు తెచ్చుకోగలుగుతాడు. దీన్ని బట్టే 'నోరు మంచి దయితే ఊరు మంచి దావుతుందన్న' సామెత పుట్టింది. కాబట్టే ఎవరు చెప్పినా వినాలి. ఏ తీరులో లభ్యమైనా గ్రహించాలి. దీనికి ఎల్లలు లేవు. సుభాషితం అన్నా సూక్తి అన్నా ఒకే అర్థం. కావ్య ప్రయోజనాలు చెప్పేటప్పుడు కూడా మన అలంకారికులు - ఉపదేశం ఒక ప్రయోజనంగా చెప్పారు. ఉపదేశం అంటే మంచి చెప్పడమనే అర్థం. ఇవాళ వ్యక్తిత్వ వికాసానికి, సంభాషణ నైపుణ్యానికి ప్రజాజీవితంలో ఎంతో ప్రాధాన్యం కనిపిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.