ఈ భయమనేదేమిటో చూద్దాం. మేధాపరంగా, శాబ్దికంగా తఱచడం కాదు. మన మానసిక భయాలు తఱచి చూడడం ద్వారా, వాటిని పరీక్షించడం ద్వారా అర్థం చేసుకోడానికి ప్రయత్నిద్దాం. అందుకు, ముందు మనలో ఆ భయం పెరిగి వికసించడానికి దానికి తగినంత ఎడముండాలి. అది అలావికసిస్తున్నప్పుడు దానిని కనిపెట్టి వుండాలి. -
మానసిక భయాలను అర్థం చేసుకుంటే, శారీరక భయాలను సులభంగానే నివారణ చేయవచ్చు, సులభంగానే అర్థం చేసుకోవచ్చు. దురదృష్టవశాత్తూ మనం శారీరక భయాలతో ప్రారంభించి, మానసిక భయాలను అలక్ష్యం చేస్తాం. మనకు రోగము, బాధ అమిత భీతి కలగజేస్తే మన మనస్సంతా దానితోనే నిండిపోయి దానితో ఎలా వ్యవహరించాలో అర్థం కాక, మానసికంగా అనేక సంఘర్షణలకు లోనవుతాం. అందుచేత మనం మానసిక భయాలతోనే ప్రారంభిస్తే, బహుశా శారీరక భయాలను, కలవరపడని మనసుతో అర్థం చేసుకొని పరిష్కరించగలమనుకుంటాను.
ఈ భయమనేదేమిటో చూద్దాం. మేధాపరంగా, శాబ్దికంగా తఱచడం కాదు. మన మానసిక భయాలు తఱచి చూడడం ద్వారా, వాటిని పరీక్షించడం ద్వారా అర్థం చేసుకోడానికి ప్రయత్నిద్దాం. అందుకు, ముందు మనలో ఆ భయం పెరిగి వికసించడానికి దానికి తగినంత ఎడముండాలి. అది అలావికసిస్తున్నప్పుడు దానిని కనిపెట్టి వుండాలి. - మానసిక భయాలను అర్థం చేసుకుంటే, శారీరక భయాలను సులభంగానే నివారణ చేయవచ్చు, సులభంగానే అర్థం చేసుకోవచ్చు. దురదృష్టవశాత్తూ మనం శారీరక భయాలతో ప్రారంభించి, మానసిక భయాలను అలక్ష్యం చేస్తాం. మనకు రోగము, బాధ అమిత భీతి కలగజేస్తే మన మనస్సంతా దానితోనే నిండిపోయి దానితో ఎలా వ్యవహరించాలో అర్థం కాక, మానసికంగా అనేక సంఘర్షణలకు లోనవుతాం. అందుచేత మనం మానసిక భయాలతోనే ప్రారంభిస్తే, బహుశా శారీరక భయాలను, కలవరపడని మనసుతో అర్థం చేసుకొని పరిష్కరించగలమనుకుంటాను.© 2017,www.logili.com All Rights Reserved.