తల్లి తనకొడుకు గదిలోకి వెళ్ళింది... 'స్కూలుకు వెళ్లాల్సిన టైమైంది కుమార్' అన్నది.
దుప్పటి ముసుగును తల మీదకి మరి కాస్త లాక్కున్నాడు కుమార్. 'నాకు స్కూలు కు వెళ్ళాలని లేదు'.
'వెళ్ళక తప్పదు' అన్నది తల్లి.
'నాకు వెళ్ళాలని లేదంటూ వుంటే. నేనంటే ఆ టీచర్ల కిష్టం లేదు. ఇక పిల్లలందరూ నన్ను వెక్కిరించేవాళ్ళే.
తల్లి కుమార్ కప్పుకోనున్న దుప్పటిని లాగేసింది. 'కుమార్ ఇది నీ ఇష్టం మీద ఆధారపడిన విషయం కాదు. నువ్వు స్కూలుకు వెళ్లక తప్పదు'.
'ఎందుకు వెళ్ళాలిట? ఎందుకు వెళ్లాలో నువు చెప్పు, చూద్దాం' అన్నాడు కుమార్.
'కుమార్ నువు నలభై ఐదేళ్ళ వాడివి; స్కూలు హెడ్ మాస్టర్ వి'.
ఇదీ, మన పరిస్థితి అంటాడు మర్క్స్ గాఫ్ నీ. అసలు నిద్ర లేవాలనే ఉండదు. ఎంతకాలంగానో ఈ నిద్ర!
- నీలంరాజు లక్ష్మీప్రసాద్