భయం మిమ్మల్ని చాలా నిదానంగా చంపే విషం. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే, అది ముమ్మల్ని తన స్వాధీనం చేసుకుంటుంది. మీరు మీకే తెలియకుండా దాని వశమైపోతారు. దానిని వదిలించుకోండి. లేకపోతే, అది మీ శక్తిని హరిస్తుంది. భయం అందరినీ మృత్యువుకన్నా ముందే అనేక వందల, వేలసార్లు చంపేస్తుంది. భయపడుతూ చస్తూ బతకడం అతి హీనమైంది. భయంలో మీరు ఎప్పటికీ మృత్యువు సేవలోనే తరిస్తూ ఉంటుంది. మరణ భయమే మౌలికమైన భయం. ఇతర భయాలన్నీ కేవలం దాని ప్రతిబింబాలే. మీరు ఏ భయం లోతుల్లోకి వెళ్లి పరిశీలించినా అక్కడ మీకు కనిపించేది మరణ భయమే.
మరణించేందుకు భయపడితే మృత్యువు మరింత శక్తివంతమైన మిమ్మల్ని మరింత భయపెడుతుంది. మరణాన్ని కూడా సంపూర్ణంగా అనుభవించేందుకు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మృత్యువు నిర్వీర్యమైన మిమ్మల్ని ఏమాత్రం భయపెట్టలేదు. నిర్జీవ జీవితం మృత్యువుకు శక్తినిస్తుంది. సంపూర్ణ జీవితం మృత్యువును నిర్వీర్యం చేస్తుంది. అన్ని భయాలు మృత్యువుతో ముడిపడినవే. ఒక్క ప్రేమ మాత్రమే మృత్యువును జయించగలడు. కాబట్టి, కాలాన్ని వృథా చెయ్యకుండా ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించండి.
భయం మిమ్మల్ని చాలా నిదానంగా చంపే విషం. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే, అది ముమ్మల్ని తన స్వాధీనం చేసుకుంటుంది. మీరు మీకే తెలియకుండా దాని వశమైపోతారు. దానిని వదిలించుకోండి. లేకపోతే, అది మీ శక్తిని హరిస్తుంది. భయం అందరినీ మృత్యువుకన్నా ముందే అనేక వందల, వేలసార్లు చంపేస్తుంది. భయపడుతూ చస్తూ బతకడం అతి హీనమైంది. భయంలో మీరు ఎప్పటికీ మృత్యువు సేవలోనే తరిస్తూ ఉంటుంది. మరణ భయమే మౌలికమైన భయం. ఇతర భయాలన్నీ కేవలం దాని ప్రతిబింబాలే. మీరు ఏ భయం లోతుల్లోకి వెళ్లి పరిశీలించినా అక్కడ మీకు కనిపించేది మరణ భయమే. మరణించేందుకు భయపడితే మృత్యువు మరింత శక్తివంతమైన మిమ్మల్ని మరింత భయపెడుతుంది. మరణాన్ని కూడా సంపూర్ణంగా అనుభవించేందుకు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మృత్యువు నిర్వీర్యమైన మిమ్మల్ని ఏమాత్రం భయపెట్టలేదు. నిర్జీవ జీవితం మృత్యువుకు శక్తినిస్తుంది. సంపూర్ణ జీవితం మృత్యువును నిర్వీర్యం చేస్తుంది. అన్ని భయాలు మృత్యువుతో ముడిపడినవే. ఒక్క ప్రేమ మాత్రమే మృత్యువును జయించగలడు. కాబట్టి, కాలాన్ని వృథా చెయ్యకుండా ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించండి.© 2017,www.logili.com All Rights Reserved.