స్వేచ్చను అందరూ విచ్చలవిడితనంగానే భావిస్తారు. ఎందుకంటే, నియంత్రించబడిన మనసు 'స్వేచ్చ' గురించి ఎప్పుడూ అలాగే ఆలోచిస్తుంది. అందరూ స్వేచ్చను కోరుకునేవారే. కానీ, అదంటే అందరికీ భయమే. ఎందుకంటే స్వేచ్చతో పాటు బాధ్యత కూడా వస్తుంది. దానిని స్వీకరించేందుకు ఎవరూ సిద్ధపడరు. అందుకే మనుషులు లోలోపల అచేతనంగా కోరుకునేది బాధ్యతారాహిత్యం, విచ్చలవిడితనాలే కానీ, అసలైన స్వేచ్చ కాదు. కానీ, బాధ్యత వద్దనుకుంటే బానిసత్వం తప్పదు. కాబట్టి, పూర్తి బాధ్యతను స్వీకరించండి. అప్పుడు బాధలలో, దరిద్రంలో, చివరికి చెరసాలలో కూడా మీకు మీరే గురువై హాయిగా స్వేచ్చగా ఉంటారు.
నిన్న, రేపు లేని, ఇప్పుడు, ఇక్కడ, ఈ క్షణంలో ఎలాంటి భయాలు లేకుండా ఉండేదే అసలైన స్వేచ్చ. జంతువుల్లా విచ్చలవిడిగా జీవించడం స్వేచ్చ కాదు. ఎందుకంటే, అలాంటి స్వేచ్చకు బాధ్యతాయుతమైన చైతన్యముండదు. కానీ, స్వేచ్చను అందరూ అలాగే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే, అనేక రకాల బానిసత్వాలలో మగ్గుతున్న మనసు స్వేచ్చ గురించి ఎప్పుడూ అలాగే ఆలోచిస్తుంది. కానీ, బాధ్యతారహితమైన అలాంటి స్వేచ్చ వల్ల మీరు ఏమాత్రం ఎదగకపోగా మరింత పతనమవుతాయి. అందుకే 'స్వేచ్చ' మీరనుకుంటున్నది కాదు.
స్వేచ్చను అందరూ విచ్చలవిడితనంగానే భావిస్తారు. ఎందుకంటే, నియంత్రించబడిన మనసు 'స్వేచ్చ' గురించి ఎప్పుడూ అలాగే ఆలోచిస్తుంది. అందరూ స్వేచ్చను కోరుకునేవారే. కానీ, అదంటే అందరికీ భయమే. ఎందుకంటే స్వేచ్చతో పాటు బాధ్యత కూడా వస్తుంది. దానిని స్వీకరించేందుకు ఎవరూ సిద్ధపడరు. అందుకే మనుషులు లోలోపల అచేతనంగా కోరుకునేది బాధ్యతారాహిత్యం, విచ్చలవిడితనాలే కానీ, అసలైన స్వేచ్చ కాదు. కానీ, బాధ్యత వద్దనుకుంటే బానిసత్వం తప్పదు. కాబట్టి, పూర్తి బాధ్యతను స్వీకరించండి. అప్పుడు బాధలలో, దరిద్రంలో, చివరికి చెరసాలలో కూడా మీకు మీరే గురువై హాయిగా స్వేచ్చగా ఉంటారు. నిన్న, రేపు లేని, ఇప్పుడు, ఇక్కడ, ఈ క్షణంలో ఎలాంటి భయాలు లేకుండా ఉండేదే అసలైన స్వేచ్చ. జంతువుల్లా విచ్చలవిడిగా జీవించడం స్వేచ్చ కాదు. ఎందుకంటే, అలాంటి స్వేచ్చకు బాధ్యతాయుతమైన చైతన్యముండదు. కానీ, స్వేచ్చను అందరూ అలాగే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే, అనేక రకాల బానిసత్వాలలో మగ్గుతున్న మనసు స్వేచ్చ గురించి ఎప్పుడూ అలాగే ఆలోచిస్తుంది. కానీ, బాధ్యతారహితమైన అలాంటి స్వేచ్చ వల్ల మీరు ఏమాత్రం ఎదగకపోగా మరింత పతనమవుతాయి. అందుకే 'స్వేచ్చ' మీరనుకుంటున్నది కాదు.© 2017,www.logili.com All Rights Reserved.