కేవలం భయం లేనంత మాత్రాన ధైర్యమున్నట్లు కాదు. తెలిసిన విషయాల హద్దులు దాటిన మరుక్షణం మీరు భయపడతారు. ఎందుకంటే, అప్పుడు ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో మీకు తెలియదు. ఆ భయమే మిమ్మల్ని తెలిసిన వాటినే పట్టుకుని వేలాడేలా చేస్తుంది. అయితే ఎన్ని భయాలున్నప్పటికీ మీకు తెలియని ప్రమాదకరమైన మార్గాలలోకి ప్రేవేశించి ముందుకు సాగడమే ధైర్యముంటే. కానీ, పిరికిపందలు అలాంటి ప్రమాదకరమైన వాటి నుంచి తప్పించుకు తిరుగుతారు. ఎందుకంటే, వారు మృతజీవులు. నిజంగా పూర్తి జీవంతో నిండిన వ్యక్తులు ఎప్పుడు తమకు తెలియని వాటిని - అవి ఎంత ప్రమాదకరమైనవైనా - తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి, ధైర్యమున్న వ్యక్తికి, పిరికివాడికి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. ఇద్దరికీ భయాలుంటాయి. కానీ పిరికివాడు తన భయాలకు తగినట్లు ప్రవర్తిస్తాడు. ధైర్యమున్న వ్యక్తి తనకున్న భయాలన్నీ పక్కన పెట్టి, తనకు తెలియని వాటిలోకి కూడా దూసుకుపోతాడు.
- భరత్