"మీరేం మాట్లాడుతున్నారు?" అనే పుస్తకాన్ని చదివాక బహుశా ప్రపంచం పట్ల, సమాజం పట్ల, సమస్త మానవ సంబంధాల పట్ల, జీవితం పట్ల కొత్త ఎరుక కలుగుతుందని నేను భావిస్తున్నాను. మాటల్లో మనుషులు తెలిసిపోతారు. దొరికిపోతారు. ఏం మాట్లాడుతున్నామో, ఏం వింటున్నామో, ఆత్మబలం ఆయుధమైన సంభాషణ ఎలా అవుతుందో, మాటను సౌందర్యవంతం చేయడం ఎట్లానో, మాటల మెళకువలు ఏమిటో, మాట రూపం, గుణం, లావణ్యం ఏమిటో, మాట ఒక గొప్ప ఆయుధం ఎట్లా అవుతుందో, ఉపన్యసించడంలోని చతురత ఏమిటో, మాటల విలువేమిటో తొమ్మిది అధ్యాయాల్లో సంభాషణల రూపంలో సులభశైలిలో రామచంద్రరాజు గారు రాసిన "మీరేం మాట్లాడుతున్నారు?" పుస్తకాన్ని చదివిన తర్వాత బహుశా మీరు అత్యంత ఇష్టపడే స్నేహితులకి, కుటుంబ సభ్యులకి, ఆత్మీయులకి మీరు తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవమనే చెబుతారు. బహుశా ఈ పుస్తకం ఎవరికైనా ఒక మంచి కానుక.
- పలమనేరు బాలాజీ
"మీరేం మాట్లాడుతున్నారు?" అనే పుస్తకాన్ని చదివాక బహుశా ప్రపంచం పట్ల, సమాజం పట్ల, సమస్త మానవ సంబంధాల పట్ల, జీవితం పట్ల కొత్త ఎరుక కలుగుతుందని నేను భావిస్తున్నాను. మాటల్లో మనుషులు తెలిసిపోతారు. దొరికిపోతారు. ఏం మాట్లాడుతున్నామో, ఏం వింటున్నామో, ఆత్మబలం ఆయుధమైన సంభాషణ ఎలా అవుతుందో, మాటను సౌందర్యవంతం చేయడం ఎట్లానో, మాటల మెళకువలు ఏమిటో, మాట రూపం, గుణం, లావణ్యం ఏమిటో, మాట ఒక గొప్ప ఆయుధం ఎట్లా అవుతుందో, ఉపన్యసించడంలోని చతురత ఏమిటో, మాటల విలువేమిటో తొమ్మిది అధ్యాయాల్లో సంభాషణల రూపంలో సులభశైలిలో రామచంద్రరాజు గారు రాసిన "మీరేం మాట్లాడుతున్నారు?" పుస్తకాన్ని చదివిన తర్వాత బహుశా మీరు అత్యంత ఇష్టపడే స్నేహితులకి, కుటుంబ సభ్యులకి, ఆత్మీయులకి మీరు తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవమనే చెబుతారు. బహుశా ఈ పుస్తకం ఎవరికైనా ఒక మంచి కానుక. - పలమనేరు బాలాజీ© 2017,www.logili.com All Rights Reserved.